మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 11 మే 2015 (12:25 IST)

జయలలిత, సల్మాన్ కేసులు తుస్స్: జగన్ కేసు ఇంతే అవుతుందా..?!

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో జయలలిత నిర్దోషి అని కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. ఈ క్రమంలో, గతంలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. జయపై మోపిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పుతో జయ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది.
 
అయితే సల్మాన్ ఖాన్ కేసు తీర్పును ముంబై హైకోర్టు రద్దు చేసిన తరహాలోనే.. జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు రద్దు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే తరహాలోనే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కేసు కూడా ఏమిలేకుండా పోతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. 
 
జయలలిత కేసుకు సంబంధించి ఆభరణాలు.. విలువైన వస్తు సామాగ్రి లభించింది.. అయితే జగన్‌ కేసులో వట్టి పేపర్లే చెలామణి అవుతున్న నేపథ్యంలో జగన్ ఈ కేసు నుంచి సులభంగా తప్పించుకునే ఛాన్సుందని టాక్ వస్తోంది. ఒకవేళ జయలలిత దోషిగా తేలితే.. జగన్ సంగతి కూడా అంతేనని.. ఆందోళనపడ్డ వారికి కర్ణాటక హైకోర్టు తీర్పు తీపి వార్తగా మిగిలిపోయింది.
 
హిట్ రన్ కేసులో సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ ముంబై హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహా విభిన్నమైన కేసైనప్పటికీ జయ కేసును కూడా కర్ణాటక హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. దీంతో జగన్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ఈ కేసు నుంచి ఎస్కేప్ అయిపోతారని జోరుగా ప్రచారం సాగుతోంది.