గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2014 (11:34 IST)

తెలంగాణలో డిజిటల్ విప్లవం రాబోతోంది : ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి

తెలంగాణలో డిజిటల్ విప్లవాన్నీ తీసుకొచ్చి టెక్నాలజీ హబ్‌గా మార్చనున్నట్టు ఆ రాష్ట్ర ఐటీ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన పెగా డెవలపర్స్ ద్వితీయ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. త్వరలో టెక్నాలజీ ఇంక్యూబేటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్టు చెప్పారు. ఇందులో 5000 కంపెనీలు కొత్త అంశాలను కనుగొనే విషయంలో భాగస్వాము లు అవుతారన్నారు.
 
ముఖ్యంగా.. తెలంగాణలో డిజిటల్ విప్లవం తీసుకురానున్నట్టు ప్రకటించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పెగా సిస్టమ్స్ మేనేజింగ్ డెరైక్టర్ సుమన్‌రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీ ప్రపంచమంతా కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. సోషల్, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్ వంటి అంశాల్లో డిజిటల్ టెక్నాలజీని పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.