శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 7 ఆగస్టు 2014 (19:03 IST)

కేసీఆర్ ఎందుకిలా మాట్లాడుతారు.. అసలు ఆయన సమస్యేంటి?

కేసీఆర్ ఎందుకిలా మాట్లాడుతారు.. తెలంగాణ ప్రజల వరకే ఆయన నాయకుడా.. సీమాంధ్ర ప్రజలు ఆయనకు గిట్టరా.. సీమాంధ్ర ప్రజలు ఆయన్నేం చేశారు.. ప్రస్తుతం ఇదే అనేక మంది విద్యార్థుల్లో తలెత్తే ప్రశ్న. 
 
1957 స్థానికత అంటూ ఫాస్ట్ పథకానికి తెరమీదికి తెచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫాస్ట్ పథకం పేరిట తెలంగాణ విద్యార్థులకు మాత్రమే మేలు చేయాలని కేసీఆర్ ఉబలాటపడుతున్నారు. 
 
అంతేగాకుండా.. ఆంధ్ర విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఫీజులు కట్టుకోవాలని, రాజధాని సూపర్‌గా, హైటెక్‌గా నిర్మించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బుండగా, పిల్లలకు ఫీజులు కట్టేందుకు లేవా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. అంతేకాదు.. ఆంధ్ర విద్యార్థుల ఫీజు భారమంతా ఆ రాష్ట్ర సర్కారే భరించాలంటున్నారు. 
 
మొత్తానికి స్థానికత పేరిట ఆంధ్ర స్టూడెంట్స్‌ను తరిమేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని విద్యార్థులు బాధపడిపోతున్నారు. అంతేకాదు..తెలంగాణకు ఆల్ రెడీ రాజధాని వుందని, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు కేపిటల్ ఏర్పాటు చేసుకోవడంలో ఈయనకు ఏంటి కష్టమని అనుకుంటున్నారు. 
 
కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా.. ఇతరత్రా మౌలిక వసతులు కావాల్సి ఉండగా కేసీఆర్ స్థానికతతో తెలంగాణలో ఉండే ఆంధ్రా విద్యార్థులకు పెద్ద తలనొప్పేనని రాజకీయ పండితులు అంటున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తే ఆంధ్రా వాళ్లను పొట్టన బెట్టుకుని కాపాడుకుంటామని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇలాంటి దూకుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రజల వరకే మేలు చేయగలుగుతారో.. ఏమో తెలియదు కానీ ఇరు రాష్ట్రాల గొడవలో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి.