శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2014 (14:59 IST)

వైఎస్సార్‌ బాటలోనే కేసీఆర్.. ప్రభుత్వ భూముల్ని అమ్మి?

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి బాటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నడుస్తున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సంక్షేమ పథకాల కోసం హైదరాబాద్ శివార్లలో ఉన్న భూములతో పాటు... మిగతా నగరాల్లో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మి కోట్ల రూపాయలను అప్పటి వైయస్ సర్కార్ ఆర్జించింది.
 
ఈ స్థలాల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బునే... సంక్షేమ పథకాల కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఖర్చు పెట్టారు. ఇప్పడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ చేయడానికి హైదరాబాద్ శివార్లలోని ఖరీదైన స్థలాలను అమ్మాలనుకుంటోంది. 
 
రైతు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ పూర్తిగా ఒప్పుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేయడానికి టీఎస్ సర్కార్ కు 19,000 కోట్లు అవసరమౌతాయి.