మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (11:08 IST)

వెంటిలేటర్‌పై ఉన్న పార్టీకి ఆశా"కిరణం"... రాహుల్‌తో చర్చలు...

సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వస్తే ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడరు. ఏదైనా బలమైన కారణాలు ఉంటే తప్ప. కొంతమంది పదవులకు ఆశపడి వెళ్లిపోతుంటారు. అది తెలిసిన విషయమే.

సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వస్తే ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడరు. ఏదైనా బలమైన కారణాలు ఉంటే తప్ప. కొంతమంది పదవులకు ఆశపడి వెళ్లిపోతుంటారు. అది తెలిసిన విషయమే. కానీ కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసి సొంతంగా ఒక పార్టీ స్థాపించి చివరకు కనుమరుగైపోయిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి పరిస్థితి అదే. గత కొన్నినెలలుగా ఏ పార్టీలో చేరాలా అన్న తర్జన భర్జనలో ఉన్న కిరణ్‌ కుమార్ రెడ్డి చివరకు తాను బయటకు వచ్చేసిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. అది కూడా రాహుల్  గాంధీతోనే ఏకంగా సంప్రదింపులు కూడా జరిపేశారు. ఇది నిజం. 
 
మొదట్లో కిరణ్‌ కుమార్ రెడ్డి జనసేన పార్టీలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత బీజేపీలోకి ఇలా.. ఒక్కోసారి ఒక్కో పార్టీని ఎంచుకుని చివరకు కార్యకర్తలు, నాయకులు, అనుచరుల ఒత్తిడితో ఏ పార్టీలోకి వెళ్ళడానికి సైలెంట్‌గా ఉండిపోయారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి గురించి పెద్దగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. 
 
కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు కిరణ్‌ కుమార్ రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఆయన సీఎం అయ్యారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమంలో తాను కలిసి పోరాటం చేశారు. సమైక్యాంధ్రాకే ఒటేశారు. అధిష్టానంతో గొడవ పడ్డారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌ కాస్త చీలిపోయింది.
 
రాష్ట్రం చీలిపోకముందే కిరణ్‌ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పేరుతో సొంతంగా ఒక పార్టీని పెట్టుకున్నారు. ఆ పార్టీ ప్రజల్లోకి ఏ మాత్రం వెళ్ళలేదు. ఇది అందరికి తెలిసిందే. చివరకు ఏమీ చేయలేక మిన్నకుండి బెంగుళూరు వెళ్ళిపోయారు.
 
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు రాజకీయాలకు దూరంగా ఉన్నా రాజకీయాలను మాత్రం వదలేదు కిరణ్‌. ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయానికి వచ్చాడు. ఎన్నో సార్లు తన అనుచరులతో సంప్రదింపులు జరిపాడు. అయితే ఒక్కోసారి ఒక్కో నిర్ణయం తీసుకుని వెనుకబడుగు వేశాడు. కానీ ఈ సారి మాత్రం ఒకే ఆలోచనలో ఉన్నారు కిరణ్‌ కుమార్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారట. ఆ పార్టీనే ఎందుకంటే ఆ పార్టీ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంది కాబట్టి. 
 
అందుకే ఆ పార్టీనే ఎంచుకుని ఆ పార్టీకే కీలక బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవితో పాటు నవ్యాంధ్ర ప్రదేశ్‌లో తాను అనుకున్నది చేయాలన్నది ఆయన ఉద్దేశం. దీంతో కిరణ్‌ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని ఆయన అనుచరులే స్వయంగా పీలేరులో మాట్లాడుకుంటుండటం కిరణ్‌ చేరిక దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది.