శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Updated : గురువారం, 5 మే 2016 (15:51 IST)

కృష్ణా నది ఎండిపోతుందా...? గ‌త 50 ఏళ్ళ ప్ర‌కాశం బ్యారేజి చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం

విజ‌య‌వాడ‌: బెజ‌వాడ‌లో ప్ర‌కాశం బ్యారేజీ ఎప్పుడూ నీళ్ళ‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. కానీ, ఇపుడు ఆ ప‌రిస్థితి లేదు... ప్ర‌కాశం బ్యారేజిలో నీరు అడుగంటింది. కేవ‌లం 4.2 అడుగుల నీటి మ‌ట్టానికి చేరింది. ఇన్ ఫ్ల

విజ‌య‌వాడ‌: బెజ‌వాడ‌లో ప్ర‌కాశం బ్యారేజీ ఎప్పుడూ నీళ్ళ‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. కానీ, ఇపుడు ఆ ప‌రిస్థితి లేదు... ప్ర‌కాశం బ్యారేజిలో నీరు అడుగంటింది. కేవ‌లం 4.2 అడుగుల నీటి మ‌ట్టానికి చేరింది. ఇన్ ఫ్లో...అవుట్ ఫ్లో కాలువ‌లు అన్నీ బంద్ అయ్యాయి. గ‌త 50 ఏళ్ళ ప్ర‌కాశం బ్యారేజి చ‌రిత్ర‌లో ఇంత‌టి నీటి క‌ర‌వు ఇదే ప్ర‌థ‌మం. ప్ర‌కాశం బ్యారేజిలో ఇపుడు కేవ‌లం 4.2 అడుగుల నీటి మ‌ట్టం ఉంది. గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి 11.9 అడుగుల నీటి మ‌ట్టం ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, దాదాపు కృష్ణా న‌ది ఎండిపోయిట్లే. 
 
గ‌త 50 ఏళ్ళ ప్ర‌కాశం బ్యారేజి చ‌రిత్ర‌లో నీటి క‌ర‌వు ఇదే ప్ర‌థ‌మం. నాగార్జున సాగ‌ర్‌లో 506.9 అడుగుల నీటి మ‌ట్టం ఉంది. ఇక్క‌డ పూర్తిగా ఎడారి వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో, తాగునీటి కోసం సాగ‌ర్ నుంచి ఏపీకి 6 టిఎంసీలు, హైద‌రాబాదుకు 3 టిఎంసీల నీరివ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అక్క‌డ నుంచి నీరు వ‌స్తే త‌ప్పించి, ఇక్క‌డ తాగునీటి అవ‌స‌రాలు గ‌డ‌వ‌ని ప‌రిస్థితి. 
 
గుంటూరు ఛాన‌ల్‌కు నీరు విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజి నుంచే వెళుతుంది. కానీ, ఇపుడు ఆ కాలువ కూడా బంద్ చేశారు. ఇపుడు ఎండ‌లు మండిపోతున్నాయి. గొంతులు ఎండిపోతున్నాయి. వ‌ర్షాలు ఈసారి ముందే వ‌స్తాయ‌ని, రుతుప‌వ‌నాలు ముందే ప‌ల‌క‌రిస్తాయ‌ని అన్నారు. కానీ, తాజాగా వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు ఇక జూన్ మొద‌టి వారం వ‌ర‌కూ రుతు ప‌వ‌నాలు వ‌చ్చే ఆశ లేద‌ని చెపుతున్నారు. అవి కేర‌ళ‌ను ఎపుడు తాకుతాయో, ఎప్పుడు తెలుగు రాష్ట్రాల‌కు చేరుతాయో తెలియ‌ని ఆయోమ‌య ప‌రిస్థితి. అందుకే ముందు చూపుతో ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిరక్షించ‌డం, ఇంకుడు గుంత‌ల‌తో భూగ‌ర్భ జాలాల‌ను సంర‌క్షించుకోవ‌డం ఇపుడు త‌ప్ప‌నిప‌రిస్థితి. లేదంటే, డెల్టా కూడా ఎడారిగా మారే ప్ర‌మాదం ఉంది.