శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: మంగళవారం, 1 నవంబరు 2016 (17:05 IST)

30 ఏళ్ళ‌లోపే పెళ్ళి కాలేదా... ఐతే స్మెర్మ్ బ్యాంక్‌‌లో సేవింగ్ సేఫ్

పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన వ‌య‌సు 18 నుంచి 25 ఏళ్ళు. కానీ, ఇపుడున్న‌కాంపిటీటివ్ యుగంలో మ‌గ‌వారికైనా, ఆడ‌వారికైనా పెళ్ల‌వ‌డానికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. జీవితంలో బాగా సెటిల్ అయిన త‌ర్వాతే పెళ్ళి అనే కాన్సెప్ట్ పెట్టుకున్న‌ వారంద‌రికీ పెళ్లి లేట‌యిపో

పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన వ‌య‌సు 18 నుంచి 25 ఏళ్ళు. కానీ, ఇపుడున్న‌కాంపిటీటివ్ యుగంలో మ‌గ‌వారికైనా, ఆడ‌వారికైనా పెళ్ల‌వ‌డానికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. జీవితంలో బాగా సెటిల్ అయిన త‌ర్వాతే పెళ్ళి అనే కాన్సెప్ట్ పెట్టుకున్న‌ వారంద‌రికీ పెళ్లి లేట‌యిపోతోంది. కెరీర్‌కి, పెళ్లికి ముడిపెట్ట‌డం అంత మంచిది కాదంటున్నారు... పెద్ద‌లు. కెరీర్ కోసం చూసుంటే, యుక్త వ‌య‌సు దాటిపోయి, త‌ర్వాత అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. 
 
తాజాగా సర్వేల ప్రకారం 30 దాటితేనే కాని యువతీయువకులు పెళ్లిపై ఆసక్తిని చూపించడం లేదట. దీనికి ప్రధాన కారణం లైఫ్‌లో స్థిరపడకపోవడం ఒకటైతే, రెండోది త‌గిన సంబంధాల కోసం వెతుకుతూనే ఉండ‌టం. అయితే, వైద్య నిపుణులు మాత్రం 25 నుంచి 30 ఏళ్ల లోపే పెళ్లి పీటలెక్కాల్సిందే అంటున్నారు. వయసు ముదిరితే వీర్యకణాల ఉత్పత్తి త‌గ్గిపోతుంద‌ట‌. వీర్యకణాల్లోని శుక్రకణాల స్థాయి వయస్సు పెరిగే కొలదీ తగ్గుతూ వస్తుంది. 
 
ఒక మిల్లీ లీటరు వీర్యకణాల్లో 135 మిలియన్ల శుక్ర కణాలు ఉండాలి. కాని డబ్ల్యుహెచ్‌వో తాజా నివేదిక ప్రకారం 30 ఏళ్లు దాటిన వారిలో 105కి ఈ శుక్రకణాల స్థాయి తగ్గినట్లు తేలింది. ఇక మహిళల విషయానికి వస్తే 30 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల విడుదల తగ్గిపోతుంది. అండం విడుదల సమస్య కారణంగా సంతానోత్పత్తికి సమస్యలు తలెత్తుతాయి. రెగ్యులర్‌గా వచ్చే పిరియడ్స్ కూడా క్రమం తప్పుతుంటాయి.
 
అయితే 30 తరువాతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన వారికి వైద్య నిపుణులు ఒక స‌ల‌హా ఇస్తున్నారు. పురుషులు తమ వీర్యాన్ని స్మెర్మ్ బ్యాంక్‌లలో భద్రపరుకోవచ్చట. మహిళలు అయితే అండాన్ని ఎగ్ బ్యాంక్‌లో భద్రపరుచుకోవడం ద్వారా సమస్య నుండి కొంత విముక్తిని పొంద‌వ‌చ్చంటున్నారు. అయినా, ఇదంతా ఎందుకు రిస్క్ అనుకుంటే మాత్రం 30 లోపు పెళ్లి చేసుకోవడమే మంచిది.