శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (19:13 IST)

ప్రపంచ టెక్ మక్కాలో ఓ భారతీయుడి దూకుడు... అమెరికన్‌ మీడియా ఫిదా

అది ప్రపంచ టెక్ మక్కా. ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తూ.. టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీలన్నింటికీ కేంద్ర బిందువు. వరల్డ్ టెక్కీ టైకూన్స్‌కు అది వేదిక. అదే సిలికాన్ వ్యాలీ. అలాంటి ప్రాంతంలో ఇప్పటివరకు మరే భారత ప్రధానికి దక్కనంత అరుదైన గౌరవమర్యాదలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కాయి.
 
 
ఈ మాట అన్నది ఓ సగటు భారతీయుడు కాదు. భారత మీడియా ప్రచారం అంతకంటే కాదు. సాక్షాత్ అగ్రరాజ్యం అమెరికా మీడియా ముక్తకంఠంతో చెప్పిన మాట. ప్రధానిని ప్రశంసిస్తూ భారతదేశ గమ్యాన్ని మార్చేసే శక్తి ఉన్నోడంటూ అగ్రరాజ్యం మీడియా కితాబిచ్చేసింది.
 
అంతేనా ప్రపంచ టెక్ మక్కాలో భారతీయుడి దూకుడు చూపించాడు. భారతదేశ చరిత్రను మార్చగలిగిన నేతంటూ ప్రశంసలు. ఇలాంటి ఆకర్షణీయమైన హెడ్డింగ్‌లతో అమెరికా వార్తా పత్రికలు నమో నామస్మరణ చేశాయి. అమెరికా టూర్‌లో ఉన్న నరేంద్ర మోడీపై భారతీయ మీడియా చేసిన హడావిడి కంటే అమెరికా స్థానిక మీడియా చేసిన హడావుడే ఎక్కువగా ఉండటం గమనార్హం. 
 
న్యూయార్క్ టైమ్స్‌తో పాటు అమెరికాలోని అన్ని పత్రికలు భారత ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తాయి. ఏడాది తర్వాతి కూడా అదే క్రేజ్ ఏమాత్రం తగ్గని ఆకర్షణ. మరే భారత ప్రధానికి దక్కనంత ఘన స్వాగతం. ఒక దేశ ప్రధానికి ఈ స్థాయిలో అదీ అమెరికాలో ఆతిథ్యం దక్కుతుందా అన్న స్థాయిలో మోడీ టూర్‌ను అమెరికా మీడియా స్వాగతిస్తూ ప్రత్యేక కథనాలు రాయడం గమనార్హం. 
 
గతేడాది తొలిసారి అమెరికాలో అడుగుపెట్టిన మోడీ మాడిసన్ స్క్వేర్‌లో చరిత్రాత్మకమైన ప్రసంగం చేసిన మోడీ.. ఈ దపా కూడా అదే తరహాలో స్పీచ్ ఇచ్చారు. అయితే, ఈ దఫా కాలిఫోర్నియాలోని శాప్ కేంద్రం వేదికైంది. దీంతో నమోకు వాక్చాతుర్యానికి అమెరికా మీడియా ఫిదా అయిపోయింది. అంతేనా... ఈ భారతీయుడు సిలికాన్ వ్యాలీని జయించాడంటూ కితాబిస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురించడం గమనార్హం.