గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (11:59 IST)

గోవింద నామస్మరణ స్థానంలో వింత శబ్దాలు... కామకేళికి అడ్డాగా తిరుపతి పార్కులు

ఆధ్మాత్మిక నగరం అల్లరిమూకలు, కామాంధులతో నిండిపోయింది. గోవింద నామస్మరణలు వినిపించాల్సిన చోట వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి వారాంతంలో హాయిగా గడపాల్సిన పార్కులు ప్రేమజంటలతో కిక్కిరిసిపోతు

ఆధ్మాత్మిక నగరం అల్లరిమూకలు, కామాంధులతో నిండిపోయింది. గోవింద నామస్మరణలు వినిపించాల్సిన చోట వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి వారాంతంలో హాయిగా గడపాల్సిన పార్కులు ప్రేమజంటలతో కిక్కిరిసిపోతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పార్కులు అడ్డాగా మారిపోయాయి. ఈ పార్కుల్లో ఉండే చెట్ల మాటున కామాంధులు రెచ్చిపోతున్నారు. దీంతో తిరుపతి నగర పాలక సంస్థలో పార్కులకు వెళ్ళాలంటే ఫ్యామిలీ జనాలు చీదరించుకుంటున్నారు.
 
తిరుపతి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఆధ్మాత్మిక నగరంగా గుర్తింపు ఉంది. దీంతో తిరుపతిలో ఎటు చూసినా దేవాలయాలు, అందులో జరిగే పూజలు, పునస్కారాలు వినిపిస్తాయి.. కనిపిస్తాయి. నిజానికి ఇలా ఉండాల్సిన పరిస్థితి వాస్తవానికి మరో తీరులో ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగర పరిధిలో మూడు, నాలుగు పెద్ద పార్కులున్నాయి. రోజంతా అలసిపోయి సేద తీరాలనే నగర వాసులకు ఆ పార్కులే కొంత ఉపశమనం కలిగిస్తాయి. అయితే అలాంటి పార్కుల్లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని కొన్ని చిల్లరమూకలు పాడుచేస్తున్నాయి. 
 
ప్రేమ పేరుతో యువతీయువకులు అడ్డదిడ్డంగా తిరుగుతూ పార్కులను వేదికగా చేసుకుని తమ అసాంఘిక కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. చంటిపిల్లలను పార్కులకు తీసుకువచ్చే తల్లిదండ్రులు వీళ్ళు చేస్తే ఇకారపు చేష్టలను చూసి తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారేమోనని భయపడిపోతున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు పార్కుల బయటే కబుర్లు చెప్పుకుని వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రవేశ రుసుము చెల్లించి మరీ ఇలాంటి ఇకారపు చేష్టలు చూడాల్సి వస్తోందని మండిపడుతున్నారు నగర వాసులు. అధికారులు మాత్రం ఇలాంటి యువతకే పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పార్కు సిబ్బంది వీరి ఆగడాలకు వంతపాడుతూ వారి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. 
 
తిరుపతి ఆధ్మాత్మికంగానే కాకుండా విద్యాకేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. అయిదు రకాల యూనివర్సిటీలు తిరుపతి నగరంలో ఉన్నాయి. దీంతో ఎక్కడెక్కడి నుంచో యువత ఉన్నత చదువుల కోసం తిరుపతికి వస్తూ ఉంటారు. కాలేజీలకు ఎగనామం పెట్టి అడ్డతిరుగుళ్ళు తిరుతున్నారు. తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా యువతే ఎక్కువగా కనిపిస్తారు. మరీ ముఖ్యంగా పార్కుల్లో అయితే వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నడిచే మున్సిపల్‌ పార్కులతో పాటు ధార్మిక చింతన కలిగిన శిల్పారామం కూడా ఈ యువత చేసే చేష్టలతో చెడ్డపేరు తెస్తున్నాయి.