గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Modified: శనివారం, 4 ఏప్రియల్ 2015 (16:00 IST)

టీడీపీలో తండ్రులకు పెద్దబాబు.. వారి తనయులకు చినబాబు క్లాసులు

చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం మంత్రులు మతులు పోతున్నాయట. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా పెద్దబాబు అడ్డం క్లాసు మీద క్లాసు పీకుతున్నారట.. ఇక చినబాబు సంగతి సరే సరి.. తండ్రి మంత్రులకు క్లాసులు పీకుతుంటే.. చినబాబు వారి తనయులకు నిలువు క్లాసులు పీకుతున్నారట. ఎందుకు మంత్రులమయ్యామాని తలలు పట్టుకుంటున్నారట. దశాబ్ధకాలం తరువాత అధికారంలోకి వచ్చినా అవేవి వారికి కనిపించడం లేదు.. వినిపించడం లేదట. ఇంతకీ ఏం జరిగింది. పాపం...
 
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ఒకటి చెబుతుంటాడు.. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వనూ... అని అంటుంటారు. అదేమోగాని ఆయన మాత్రం నిమిషం తీరకలేకుండా దొరికిన వారికి దొరికినట్లు క్లాసులు పీకుతున్నారట. మంత్రివర్గ సమావేశం జరిగితే చాలు ఆ ఎవరికి క్లాసు పీకుతారోనని మంత్రులు భయపడిపోతున్నారట. పని తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. క్రమశిక్షణకు మారుపేరు తమ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబులు మంత్రులు తన అనుమతి లేనిదే నోరు తెరిచేందుకు లేదని హుకుం జారీ చేస్తున్నారట. అదేమంటే పార్టీ క్రమశిక్షణ పేరుతో గంటలకు గంటలు క్లాసులు పీకించుకోవాల్సి ఉంటుంది. అందుకే మంత్రలు నోరు తెరిచి రెండు వాక్యాలు చెబితే అందులో చంద్రబాబు భజన సగం ఉంటుందని తెలుగుదేశం నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఈయన పరిస్థితి ఇలా ఉంటే చిన్నబాబు ఇప్పటి నుంచే మంత్రుల తనయులకు క్లాసు తీసుకునే పనిలో బిజిగా ఉన్నారట. 
 
అధికారం ఉంటే మంత్రుల తనయులు ఊరుకుంటారా.. చెప్పండి. పైగా పార్టీ పదేళ్ళ తరువాత అధికారంలోకి వచ్చింది. ఇక కొంచెమైనా అధికార పెత్తనం చేయకపోతే ఎలా..? ఇది ఏ పార్టీలోనైనా కామనే. మంత్రివర్యుల పుత్రరత్నాలు కొందరు అమ్మ, అయ్యల పేర్లు చెప్పి వ్యాపారాలు చేయడం, అధికారులకు  ఫోన్లు మామూలే. అయితే ఇది తెలిసిన వెంటనే లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. వారిని పిలిపించుకుని హెచ్చరికలు చేస్తున్నారట. ఎక్కువ మాట్లాడితే తనకున్న ఫీడ్ బ్యాక్ ను వారి ముందు పెట్టి మరీ ఎక్కువ క్లాసులు పీకుతున్నారట. రాయలసీమ మంత్రుల కొడుకులు ఇద్దరు, ఉత్తరాంధ్ర మంత్రి కుమారుడు ఒకరికి లోకేష్ చేత అక్షింతలు వేసినట్లు సమాచారం. 
 
ఎన్నికల ముందు చంద్రబాబు పాదయాత్ర చేసినపుడు ఉత్తరాంధ్రలో ఇంత ఖర్చయిందని చెప్పి, ఓ మంత్రి కుమారుడు అక్కడి పారిశ్రామిక వేత్తలు, కంపెనీల నుంచి వసూళ్లు సాగించారని సమాచారం. తమ బిడ్డలపై లోకేష్ ఇలా చేయడం, తమ వ్యవహారల మీద నిఘా వేయడం మంత్రులకు మింగుడు పడడం లేదు. అయితే నోరు తెరవడానికి మాత్రం సాహసించడం లేదు. క్షేత్ర స్థాయిలో తమ కంటే కింద ఉన్న నాయకులు కూడా వారి పేరు చెప్పినప్పడు కిమ్మనకుండా మిన్నకుండిపోతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. తండ్రులకు ముఖ్యమంత్రి.. తనయలకు లోకేష్ క్లాసలు తప్పడం లేదు.