శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:10 IST)

నారా లోకేష్‌ బినామీ భాగోతం.. ఆధారాలివిగో..!

నారా లోకేష్‌ కనుసన్నల్లో ఆయన కంపెనీలోని వ్యక్తులకు చెందిన వారి పేర్లతోనే పరిశ్రమలు వెలుస్తున్నాయి. అలాంటి వాటికే అనుమతులొస్తున్నాయి. ప్రజలు కాదన్నప్పటికీ పోలీసులతో అణచివేసి ముందుకు సాగుతున్నాయి.

నారా లోకేష్‌ కనుసన్నల్లో ఆయన కంపెనీలోని వ్యక్తులకు చెందిన వారి పేర్లతోనే పరిశ్రమలు వెలుస్తున్నాయి. అలాంటి వాటికే అనుమతులొస్తున్నాయి. ప్రజలు కాదన్నప్పటికీ పోలీసులతో అణచివేసి ముందుకు సాగుతున్నాయి. సొంత వ్యాపార విస్తరణతో పాటు నారా లోకేష్‌ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారి వ్యాపార సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా కనబడుతోంది. ఇటీవల కోస్తా తీరంలో పెడుతున్న పరిశ్రమంలో ఎక్కువ భాగం సదరు కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారికి చెందినవే ఉన్నాయి. 
 
చెయిన్ లింక్ సిస్టంలో ఈ డైరెక్టర్లు అన్ని కంపెనీల్లోకి విస్తరించారు. వారికి అనుగుణంగా ప్రభుత్వం కూడా వేగంగా అంతో ఇంతో సాయం చేస్తోంది. కోస్తాలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోని ఒకటి, రెండు అడ్రస్సుల్లోనే ఉండడం విశేషం. ఆయా కంపెనీలన్నీ కోస్తా తీరంపైనే కేంద్రీకరించాయి. దీని వెనుక ప్రభుత్వాన్ని పక్క నుంచి నడిపిస్తున్న యువనేత భాగస్వామ్యం ఉందనే విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది.
 
లోకేష్‌ కంపెనీలో కీలకమైన పదవుల్లో ఉన్న వారి భాగస్వామ్యంలో ఉన్న సంస్థలే గత రెండేళ్ళుగా కోస్తాలో ముందుకు రావడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ గానీ ఆయా కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలన్నీ యువనేత కనుసన్నల్లో సాగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
 
ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా తొండంగి, పంపాదిపేట ఏరియాలో పెడుతున్న దివీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ ప్రసాద్ డైరెక్టరుగా ఉన్న పృథ్వీ అసెట్స్ రీ కన్‌స్ట్రక్షన్స్ అండ్ సెక్యూరిటైజేషన్‌ కంపెనీ లిమిటెడ్‌లో యువనేత కంపెనీలో కీలక వ్యక్తి మరో డైరెక్టరుగా ఉన్నారు. టచ్ స్టోన్ లిమిటెడ్, ఈ క్వీటీస్ కంపెనీలోనూ వీరిద్దరు ఉమ్మడి డైరెక్టరుగా ఉన్నారు. నంద్యాల శ్రీ విష్ణురాజు రేవతి ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయనే మరో 15 సంస్థల్లో డైరెక్టరుగానూ, వివిధ హోదాల్లోనూ ఉన్నారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలూ నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఎక్స్‌ట్రాగా ల్యాండ్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కీలకంగా ఉంది. ఒక మీడియా సంస్థలోనూ కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. మరో కీలక వ్యక్తి రాజేష్‌ ఠాగూర్ అహూజా కూడా పలు కీలక కంపెనీలను నిర్వహిస్తున్నారు.
 
బీమోర్ కన్సల్టింగ్ కిచెన్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫామ్ లీఫ్‌, ఫర్నీటెక్ ఇండియా లిమిటెడ్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. పైన పేర్కొన్న కంపెనీల్లో ఎనిమిది కంపెనీలు ఎక్కువ భాగం హైదరాబాద్ కొండాపూర్‌లోని రాజప్రసాదం అనే భవనం అడ్రస్‌తోనే ఉన్నాయి. ఒకే అడ్రస్‌తో రెండు మూడు కంపెనీలు ఉన్నాయి.
 
వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లతో పోల్చినా అదే అడ్రస్ రావడం వెనుక వీటి నిర్వాహకులు ఒకరే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువనేత కంపెనీలో రాజేష్‌ ఠాకెఊర్ అహూజా 2016లో బాధ్యతలు తీసుకోగా మిగిలిన వారి డైరెక్టర్లుగా ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన ఇంకా చెప్పాలంటే ఇటీవల భారీగా షేర్ వాల్యూ పెంచుకోవడం ద్వారా బాబు కుటుంబ ఆస్తులు భారీగా పెరగడానికి కారణమైన కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్న వారే ఇన్ని కంపెనీలలో భాగస్వాములుగా ఉండడం విశేషం. 
 
ఏపీలో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అనేక కంపెనీలో వెలసిన తీరు.. వాటిలో చంద్రబాబు తనయుడు లోకేష్ కంపెనీలలో భాగస్వామ్యులు డైరెక్టర్లుగా మారిపోయిన తీరు గమనిస్తే ఏపీ పారిశ్రామిక రంగంలో పెద్ద స్కెచ్ నడుస్తోందని అర్థమవుతోంది. చినబాబుకి చెప్పకుండా ఏపీ పాలనో ఏ పాలసీ కూడా తీసుకోలేని మంత్రులున్నారనడానికి ఈ తాజా వివరాలు అద్దం పడుతున్నాయి. చాలా కాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు అవినీతి బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే కేంద్రం ముందు ఏపీ హక్కుల కోసం నిలదీయలేకపోతున్నారన్న ఆరోపణలకు ఇవి అద్దంపట్టేలా ఉన్నాయని చెప్పకతప్పదు.