శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 22 నవంబరు 2016 (16:33 IST)

ప్రధాని మోదీ కళ్లలో నీటి తెర... నేరుగా నాకే చెప్పండి... నోట్ల రద్దు ఇబ్బందిపెడుతుందా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని భాజపా నాయకులంతా ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. ఎంపీల మద్దతుతో నరేంద్ర మోదీ కళ్ల వెంట నీటి తెరలు ఉబికినట్లు సమాచారం. ఆయన భావోద్వేగాన్ని ఇప్పటికే చాలాసార్లు మనం చూశాము కూడా. ఇకపోతే నోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకమైనద

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని భాజపా నాయకులంతా ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. ఎంపీల మద్దతుతో నరేంద్ర మోదీ కళ్ల వెంట నీటి తెరలు ఉబికినట్లు సమాచారం. ఆయన భావోద్వేగాన్ని ఇప్పటికే చాలాసార్లు మనం చూశాము కూడా. ఇకపోతే నోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకమైనదనీ, దీనితో అవినీతి అంతం సాగుతుందని అభిప్రాయపడ్డారు. కానీ పెద్దనోట్లు రద్దు చేసి 12 రోజులు కావస్తున్నా దేశంలో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరి నిలబడే ఉంటున్నారు. మరి ఈ విషయాన్ని మాత్రం వారు లైట్ గా తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిరు వ్యాపారులు నోట్ల రద్దుతో చితికిపోతున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ భాజపా పార్లమెంటరీ నాయకులు దీన్ని ఏమాత్రం ఖాతరు చేయడంలేదనే అనుమానం వస్తోంది. ఎందుకంటే నోట్ల రద్దుపై ప్రజలు కష్టాలు పడుతున్నా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని భాజపా చెపుతోంది. 
 
అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. నోట్ల రద్దు ప్రజలకు ఎలా అనిపిస్తుందంటూ ఓ సర్వే చేపట్టారు. ఇందులో మూడు ఆఫ్షన్లు ఇచ్చి రద్దు బావుంది, రద్దువల్ల కష్టపడుతున్నాం కానీ బాగానే ఉంది, తీవ్ర కష్టాలు పడుతున్నాం అనే ఎంపికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ యాప్ డౌన్లోడ్ చేసి నోట్ల రద్దుపై ప్రజలు తమతమ అభిప్రాయాలు వెల్లడించవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ లింకు ఏమిటంటే... హెచ్‌టిటిపి nm4.in/dnldapp అనేది. ఈ లింకును డౌన్లోడ్ చేసుకుని ప్రజలు ఈ సర్వేలో పాల్గొనవచ్చు. మరి ఎంతమంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొంటారో వెయిట్ అండ్ సీ.