శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 9 మే 2017 (13:48 IST)

తితిదే కొత్త ఈవో రగడ ఎందుకో తెలుసా...?

టీటీడీ ఈఓగా నూతన తెలుగేతర ఐఏఎస్ అధికారిని నియమించడం వివాదాస్పదంగా మారింది. ఈఓగా సాంబశివరావు స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. అయితే సింఘాల్ తిరుపతిలో బాధ్యతల తీసుకున్న రోజే ఆయనకు వి

టీటీడీ ఈఓగా నూతన తెలుగేతర ఐఏఎస్ అధికారిని నియమించడం వివాదాస్పదంగా మారింది. ఈఓగా సాంబశివరావు స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. అయితే సింఘాల్ తిరుపతిలో బాధ్యతల తీసుకున్న రోజే ఆయనకు వివాదాలు స్వాగతం పలికాయి. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందసరస్వతి ఈవో నియామకం అంశంలో ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆగమశాస్త్రం నియమాలులేని ఉత్తరాది వాళ్లను టీటీడీకి ఈఓ నియమించడాన్ని తప్పుబట్టారు. పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలకమైన టీటీడీ ఈఓగా ఉత్తదాది వ్యక్తిని నియమిచడాన్ని విమర్శించడం వివాదానికి ఆజ్యం పోసినట్టయింది.
 
ప్రపంచంలోనే ప్రసిద్ధ హైందవపుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అంశంపై వివాదాలు కమ్ముకున్నాయి. టీటీడీ ఈఓ సాంబశివారు పదవీకాలం పూర్తికాగానే నూతన ఈఓ నియామకంపై తీవ్రతర్జన భర్జనలు జరిపిన అనంతరం 1983 బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను నూతన ఈఓగా ఏపీ సర్కారు నియమించింది. జన్మతహా బీహారీ అయిన ఏపీ క్యాడర్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను నూతన టీటీడీ ఈఓగా ప్రభుత్వం నియమించడాన్ని స్వరూపానంద సరస్వతి తీవ్రంగా తప్పుబట్టారు. ఆగమశాస్త్రం ఆచరించని ఉత్తరాది వాళ్లను వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం నిత్యపూజలు జరిగే టీటీడీలాంటి ధార్మిక క్షేత్రానికి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. 21కుల వృత్తులు ఆగమాలు తిరుమల ఆలయవ్యవస్థలో ఉన్నాయన్నారు. అంత ప్రాధాన్యత ఉన్న ఆలయ పర్యవేక్షణను ఆగమాలుపాటించని, తెలుగురాని వ్యక్తి చేతి లోపెట్టడంపై ఆరోపణలు గుప్పించారు. నిజాయితీ పరునిగా వ్యవహరిస్తూ ఈవోగా మంచి పేరుతెచ్చుకున్న సాంబశివరావును మార్చడం సరైంది కాందంటున్నారు. ఉత్తరాది అధికారిని టీటీడీ ఈఓగా నియమించడంపై న్యాయపోరాటానిక తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
 
మరోవైపు అనూహ్యంగా స్వరూపానంద స్వామికి పరోక్షమద్దతు పలికే తరహాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రముఖ ఉత్తరాధి ఆలయంలోనూ దక్షిణాధి అధికారులు లేరని.. అమరనాథ్, వారణాసి, మథుర చరిత్రలో ఒక్కసారయినా దక్షిణాది అధికారికి చోటుదక్కలేదని గుర్తుచేశారు. మరి టీటీడీ వంటి ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక సంస్థకు ఉత్తారాది వారిని ఎందుకు నియమించారంటూ ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు పవన్ కళ్యాణ్. 
 
ఇక టీటీడీ చరిత్రలోనూ తొలిసారిగా ఉత్తరాది చెందిన వ్వక్తిని టీటీడీ ఈఓగా నియమించడమూ చర్చనీయాంశం గామారింది. 8 దశాబ్దాల తర్వాత మళ్లీ ఉత్తరాది అధికారి పర్యవేక్షణలో టీటీడీ వ్యవహారాలు జరగబోతుండటం విశేషం. ఇప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ ఓక వ్వవస్థ ఉందిగానే 80 యేళ్ళ క్రింతం పూర్తిగా తిరుమల వ్వవహారాలు మహంతుల పాలనలోనే జరిగేవి. వారసత్వంగా 180 ఏళ్లపాటూ ఉత్తారది మహంతులే తిరుమల సర్వాధికారులుగా ఉండేవారు. మొదట్లో మహంతుల పాలన సజావుగానే జరిగినా తర్వాత కాలంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు 1932లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తితిదేను ఏర్పాటుచేసింది. అప్పటినుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అధికారులనే నియమిస్తూ వచ్చేది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా తెలుగు అధికారుల పర్యవేక్షణలోనే టీటీడీ వ్యవహారాలు నడిచేవి. అయితే దాదాపు 90ఏళ్ల తర్వాత మహంతుల అనంతరం మళ్లీ ఉత్తరాది అధికారి పర్యవేక్షణలో శ్రీవారి ఆలయ వ్యవహారాలు జరుగనున్నాయి. 
 
మొదట తెలుగు ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించినా.. టీటీడీ ఈఓ పోస్టు కోసం సీనియర్ తెలుగు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు అనూహ్యంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమీషర్‌గా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో ఉన్నఫళంగా ఢిల్లీ నుంచి తిరుపతికి మకాంమార్చేశారు అనికుమార్ సింఘాల్. అయితే టీటీడీ ఈఓగా ఉత్తరాది అధికారిని నియమించడంపై భిన్నవాదనలు వినిపిస్తన్నాయి. టీటీడీలాంటి అతిపెద్దక ధార్మిక సంస్థలో భక్తులతో ఇంట్రాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కువమంది తెలుగు వారే శ్రీవారిని దర్శింస్తుంటారు. వారి లోటుపాట్లను దగ్గరుండి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగేతర అధికారికి డైరెక్ట్‌గా భక్తులతో ఇంట్రాక్ట్ అవ్వాలంటే భాషాసమస్య ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందన్న వాదనలూ లేకపోలేదు. 
 
మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా నూతన ఈఓ వచ్చీరాగానే ఆయన ప్రమేయం ఏమీ లేకుండానే వివాదాలు కమ్ముకున్నాయి. అయితే ఆలయవ్యవహారాలతో పాటూ భక్తుల సమస్యలపై దృష్టి సారిస్తే అనిల్ కుమార్ సింఘాల్ తన పనితీరుతోనే వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే ఆరోపణలు గుప్పించేవారికి మరింత అవకాశం ఉంటుంది. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు కలెక్టర్ గావ్యవహరించిన అనుభవంతోపాటూ సమర్ధతనూ చాటుకున్నారు సింఘాల్. ఢిల్లీ ఏపీ భవన్‌లోనూ రెసిండెంట్ అధికారిగా మంచి పేరే తెచ్చుకున్నారు. మరి టీటీడీ కొత్త ఈఓ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.