శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 19 మే 2015 (16:35 IST)

ఇక్కడింకా ‘4జీ’కే గతి లేదు... అక్కడ అప్పుడే ‘5‌జీ’ సేవలు..? కేసీఆర్‌కు బాబు వైఫై షాక్

తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ షాకిచ్చింది. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు నాయుడు తాను కేసీఆర్ కంటే ఓ అడుగు ముందున్నానని చేప్పే ప్రయత్నమే చేశారు. విజయవాడ బస్టాండులో ‘5జీ’ వైఫై సేవలను చప్పుడు కాకుండా ప్రారంభింప చేశారు. అంత పెద్ద పేరు ఉన్న హైదరాబాద్ లోనే 4జీ సేవలే సక్రమంగా అందుబాటులో లేకుండా ఉంటే విజయవాడలో 5‘జీ’ సేవలా... అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంత పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ఎత్తుల్లో భాగమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
గతేడాదే సెప్టెంబర్ చివరినాటికి గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ అంతటా 4జీ సేవలు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఈ మేరకు సంబంధిత కంపెనీలతోనూ ప్రభుత్వం చర్చలు జరిపింది. తొలుత హైదరాబాద్ తర్వాత వరంగల్‌ని 4జీ వైఫై నగరంగా మారుస్తామని కంపెనీల అధికారులూ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హైదరాబాద్ పరిధిలోకి 4జీ వస్తుందన్న వార్తలతో మొబైల్ యూజర్స్ హ్యాపీగా ఫీలయ్యారు. ఆన్‌లైన్‌లో తమ పనులు వేగంగా అవుతాయని భావించారు. 
 
రీసెంట్‌గా ఏప్రిల్‌లో హుస్సేన్‌సాగర్ సమీపంలోవున్న హోటల్ మారియట్‌ వేదికగా ఈ ఉచిత వైఫై పైలట్ ప్రాజెక్టుని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెల్సిందే! పూర్తిస్థాయి 4జీ సేవలు నగరంలో ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే 4జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో లేని, ఏపీలో విజయవాడ కేంద్రంగా అప్పుడే 5జీ సేవలు మొదలవడంపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు చర్చించుకుంటున్నారు. 
 
ఇదంతా చంద్రబాబు మైండ్ గేమ్ అని కొందరు అంటుంటే మరికొందరేమో.. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నమని వాదిస్తున్నారు. కొద్దిరోజుల్లో ఏపీలోని బస్సులకూ వైఫై సేవలను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజధానే లేని రాష్ట్రంలో వైఫై, 4జీ,5జీలు ప్రస్తుతం హాట్ టాపిక్ లుగా మారిపోయాయి. సోషల్ మీడియాలో కామెంట్స్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నెటీజన్ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.