మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : సోమవారం, 11 జులై 2016 (13:02 IST)

తిరుమలకు బస్సు ప్రయాణమా... బాబోయ్... విరిగిన స్టీరింగ్.. తుప్పుపట్టిన బ్రేకులు...

ఇదేంటి.. తిరుమలకు బస్సు ప్రయాణమే సురక్షితం.. అని ప్రతి ఆర్టీసీ బస్సు వెనుకల రాసుంటుంది. అయితే బస్సు ప్రయాణం సురక్షితం కాదు అంటున్నారేంటి అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి.. ఫోటోలో తిరుమల నుంచి తిరుపతిక

ఇదేంటి.. తిరుమలకు బస్సు ప్రయాణమే సురక్షితం.. అని ప్రతి ఆర్టీసీ బస్సు వెనుకల రాసుంటుంది. అయితే బస్సు ప్రయాణం సురక్షితం కాదు అంటున్నారేంటి అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి.. ఫోటోలో తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న ఒక ఆర్టీసీ బస్సు. అందులో డ్రైవర్‌ స్టీరింగ్‌ను తిప్పుతూ కూర్చుని ఉన్న ఫోటో.. ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఫోటోను బాగా చూడండి... డ్రైవర్‌ పట్టుకుని ఉన్న స్టీరింగ్‌ మధ్య భాగం మొత్తం ఇరిగిపోయింది. అంతే స్టీరింగ్‌ పోయిందన్న మాట. ఇరిగిపోయిన స్టీరింగ్‌ను తాడు కట్టి పెట్టారు మన ఆర్టీసీ అధికారులు. దీన్ని బట్టి ఇప్పటికే అర్థమై ఉంటుంది..బస్సు ఏ మాత్రం సురక్షితమో..
 
తిరుమల ఘాట్‌.. ఈ పేరు వింటేనే చాలా మందికి భయం. ఎందుకంటే భయానకమైన మలుపులు. ఎత్తైన కొండలు. ఆదమరిస్తే అంతే సంగతులు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తిరుమలకు వచ్చే ఎక్కువ మంది భక్తులు ఘాట్‌ రోడ్డు ప్రయాణం అంటేనే భయపడి పోతుంటారు. చాలామందైతే వాహనాల్లో వెళ్లకుండా నడిచివెళ్ళి, నడిచి వచ్చే వారు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదకరమైన ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
 
ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది.. నష్టాల్లో నడుస్తోందని ప్రయాణీకుల ప్రాణాలను తీసేస్తారా..? కనీసం స్టీరింగ్‌లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఆర్టీసీ ఉందా.. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మెదులుతున్నాయి. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న ఒక బస్సు మాత్రమే కాదు ఇలాంటి స్టీరింగ్‌లు ఇరిగిపోయిన బస్సులు ఎన్నో ఉన్నాయి. ఘాట్‌ రోడ్డులో ఇప్పటివరకు బస్సు ప్రమాదాలు ఎన్నో జరిగాయి. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ప్రతిసారి ప్రమాదం జరిగిందని అందరూ చెబుతుంటారు. అయితే బస్సు కండిషన్‌లో ఉంటేనే కదా డ్రైవర్‌ నడపడానికి. 
 
తిరుమలలో ఎన్నోసార్లు స్టీరింగ్‌లు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే పిట్టగోడలను ఢీకొనో, లేక చెట్లకు ఢీకొనే ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఇప్పటివరకు భక్తులు గాయాలతో బయటపడ్డారు తప్ప ఎప్పుడూ ప్రాణనష్టమైతే జరగలేదు. ప్రాణనష్టం జరగకపోవడానికి శ్రీవారి లీలలు కూడా ఉన్నాయని భక్తులే చెప్పుకుంటుంటారు.
 
ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఏ వాహనానికైనా స్టీరింగ్‌ చాలా ముఖ్యమైనది. అలాంటి స్టీరింగే విరిగిపోతే ఆ స్టీరింగ్‌ను బాగుచేయాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. అయినా సరే ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు బస్సులను మరమ్మత్తులు చేసిన పాపాన పోలేదు. అంతే కాదు కనీసం ప్రథమ చికిత్స బాక్సులు కూడా ఏ బస్సులోను కనిపించవు. అది ఆర్టీసీ స్థితి. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.