శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: బుధవారం, 16 నవంబరు 2016 (18:27 IST)

బెజ‌వాడ‌లో జోరుగా రూ.2000 నోట్ల మార్పిడి... 60:40 రేషియో

విజ‌య‌వాడ ‌: దేశంలో పెద్ద నోట్ల రద్దు కూడా నల్ల కుబేరులకు వరంగా మారుతోంది. నోట్ల మార్పిడికి వీరు నిరుపేద‌లు, ఉద్యోగుల‌నే పావులా వాడుతున్నారు. ఇక కొంద‌రు ద‌ళారుల అవ‌తారం ఎత్తి 60-40 రేషియోలో, కోటికి 60 ల‌క్ష‌లు కొత్త నోట్లు ఇస్తున్నారు. ఇప్పటికే లక్షల

విజ‌య‌వాడ ‌: దేశంలో పెద్ద నోట్ల రద్దు కూడా నల్ల కుబేరులకు వరంగా మారుతోంది. నోట్ల మార్పిడికి వీరు నిరుపేద‌లు, ఉద్యోగుల‌నే పావులా వాడుతున్నారు. ఇక కొంద‌రు ద‌ళారుల అవ‌తారం ఎత్తి 60-40 రేషియోలో, కోటికి 60 ల‌క్ష‌లు కొత్త నోట్లు ఇస్తున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు `పేదల' గుర్తింపు కార్డుతో పెద్ద నోట్లు చెల్లుబాటై కొత్త నోట్లు నల్లకుబేరుల చేతికి చేరాయి. విజయవాడ గవర్నరుపేటలోని బట్టల కొట్టు వ్యాపారులు నిరంతరం పెద్దనోట్ల మార్పిడి పనుల్లోనే ఉన్నారు. 
 
బట్టల కొట్టు వ్యాపారులు షాపు తీసింది మొదలు పనివాళ్ళ‌కు నాలుగు వెయ్యి నోట్లు ఇచ్చి బ్యాంకులకు పంపి పెద్ద నోట్లు చెలామణి చేయిస్తున్నారు. పనివాళ్ల గుర్తింపు కార్డుతో ఈ తతంగం నడిపిస్తున్నారు. నాలుగు వేలు పాత వెయ్యినోట్లు ఇచ్చి వారి పేరు తెల్లకాగితం మీద రాస్తున్నారు. బ్యాంకులో పెద్ద నోట్లను మార్చి తెచ్చిన తరువాత టిక్కులు కొట్టి లెక్క చూసుకుంటున్నారు. నమ్మకస్తులైన పని వాళ్లకు వారి ఇళ్ళ దగ్గర ఉండే పేదవారిని గుర్తించి పాత పెద్దనోట్లు మార్చే పని పురమాయిస్తున్నారు. ఈ పనులకు ఎక్కువగా మహిళా ఉద్యోగులనే ఊపయోగిస్తున్నారు. 
 
ఒకొక్క బట్టలకొట్టు వ్యాపారికి మూడు షాపుల వరకు ఉన్నాయి. అందులో పనివాళ్ళే బలిపశువులుగా మారుతున్నారు. కొంతమంది నల్లకుబేరుల ఏకంగా బ్యాంకు ఎకౌంటు ఉన్న పేదవారిని లక్ష్యంగా చేసుకొని వారి ఎకౌంట్లలో డబ్బు జమ చేసి వాటిని విత్‌డ్రా చేసుకునే ఏర్పాట్లు జరిగాయి. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా పనివారిని పురమాయించారు. పెద్దనోట్లు మార్చుకొచ్చేవారికి నెలకు 15 వేలు జీతం ఇచ్చేలా తాత్కాలిక పనివారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఎక్కడికక్కడ సామాన్యుడికి చేరుతున్నట్లు కనిపిస్తున్న డబ్బు క్షణాల్లో నల్ల కుబేరుల చేతికి చేరిపోతుంది.
 
ఇక బడా వ్యాపారస్తులైతే తమకు ఉన్న వ్యాపారం అంతా `వైట్ ' అని మీకు కావాలంటే పాత నోట్లు వెయ్యి, ఐదొందల నోట్లు కోటి ఇస్తే అరవై లక్షలు చెల్లుబాటు ఐయ్యే కొత్త నోట్లు ఇస్తామని చెబుతున్నారు. దానికి కూడా కొన్ని షరతులు పెడుతున్నారు. ముందుగా పాత పెద్ద నోట్లు ఇస్తే వాటికి నమ్మకం కుదిరేలా ఇవ్వ దలచిన మొత్తానికి డీడీ ఇచ్చి, కొద్ది రోజుల గడువుతో చెలామణి అయ్యే కొత్త నోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. వాస్తవానికి  పేదవారి దగ్గర లక్ష ఉన్నా ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వారానికి ఇరవై వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం చాలా చోట్ల ఎక్కువ మంది పదేపదే రోజు వారీగా నాలుగువేలే నోట్ల మార్పిడికి బ్యాంకులకు వస్తు న్నారు. వీరిలో ఏమీ తెలియని వారే బలిపశువులుగా మారే అవకాశం ఉంది. ఆదాయానికి మించి నోట్ల మార్పిడి చేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ రాయతీలు కోల్పోయే ప్రమాదం ఉంది.