Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పన్నీరు కొంప ముంచిన భాజపా, శశికళను నమ్ముకుని వుంటే పన్నీరే కింగా?

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (15:58 IST)

Widgets Magazine
panner selvam

డ్యామిడ్... కథ అడ్డం తిరిగింది. ఒక్కొక్కప్పుడు ప్రజలంతా మాకొద్దు బాబోయ్ అంటున్నా ఇష్టం లేని నాయకుడు లేదా నాయకురాలు పీఠాలపై కూర్చుంటారు. పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు చెంపలు వాయించుకుంటూ వారి పాలనలో ప్రజలు ఐదేళ్లపాటు బతుకీడుస్తారు. ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి అలాగే వుందంటున్నారు.
 
ఇకపోతే శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు రాజీనామా పత్రాన్ని గవర్నర్ చేతులకు అందించిన పన్నీర్ సెల్వం ఆ తర్వాత భాజపా కనుసన్నల్లో నడుచుకున్నారనే విమర్శలున్నాయి. శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, సినీ సెలెబ్రిటీల నుంచి పెద్దఎత్తున మద్దతు కూడా వచ్చింది. ఐతే ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు మాత్రం పన్నీర్ సెల్వం వైపు లేరు. 
 
అంతా గోల్డెన్ బే రిసార్టుకే పరిమితమైపోయారు. శశికళ ఎంత చెబితే అంత అన్నట్లు అక్కడే అతుక్కుపోయారు. ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో పన్నీర్ ఘోరంగా విఫలమయ్యారు. పన్నీర్ పైన నమ్మకం వుంచి వెన్నుదన్నుగా నిలిచిన భాజపాకు శశికళ ఒక రకంగా చుక్కులు చూపించింది. జైలుకు వెళుతూ తన లెక్కను పూర్తిగా అమలుచేసి మరీ వెళ్లిపోయింది. 
 
ఏతావాతా చూస్తే పన్నీర్ సెల్వం నిండా మునిగిపోయారు. ఎలాగంటే... శశికళ చెప్పినట్లు రాజీనామా చేసి మిన్నకుండా వున్నట్లయితే ఆయనకు మంత్రి పదవి ఖచ్చితంగా దక్కి వుండేది. అలాగే... ఇప్పుడు శశికళ జైలుకు వెళ్లింది కనుక ఆమె మళ్లీ పన్నీర్ సెల్వంనే పార్ట్ టైం సీఎంగా అపాయింట్ చేసి వుండేది. అలా చూసినప్పుడు పన్నీర్ సెల్వం లక్కీ ఛాన్స్ మిస్సయ్యారంటున్నారు. భాజపా మాయలో పడి అంతా పోగొట్టుకుని చివరకు పార్టీ నుంచి వేటు కూడా వేయించుకుని ఒంటరిగా మిగిలిపోయారు. ఏం చేస్తాం... రాజకీయాల్లో ఏదయినా సాధ్యమే మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

2019 ఎన్నికలే టార్గెట్.. రజనీని బుజ్జగించే పనుల్లో బీజేపీ? వెయిట్ అండ్ వాచ్ అంటోన్న అమిత్ షా

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు రాజకీయాలపై స్పందించాడు. అన్నాడీఎంకే నుంచి ...

news

కూరలో కారం ఎక్కువైందని భార్యను చంపిన భర్త.. అక్రమ అఫైర్‌కు తల్లి అడ్డు.. చంపి ఐదు రోజులు?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతున్నాయి. కూరలో కారం ఎక్కువైందనే ...

news

'అమ్మాడీఎంకే' పేరుతో కొత్త పార్టీ.. బ్రాండ్ అంబాసిడర్‌గా దీప.. ధర్మయుద్ధానికి "తయార్''

అన్నాడీఎంకే నుంచి వెలివేసిన తర్వాత పురట్చి తలైవర్ (తిరగుబాటు నాయకుడు) పన్నీర్ సెల్వం ...

news

1985.. ఎయిరిండియా కనిష్క కూల్చివేత.. 329 మంది మృతి.. నిందితుడు విడుదల

1985 జూన్ 23 న 329 మందితో కెనడా-మాంట్రియల్-ఢిల్లీ రూట్ లో వెళ్తున్న ఎయిరిండియా విమానం ...

Widgets Magazine