శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (16:17 IST)

పవన్ కల్యాణ్ పార్టీకి కష్టాలు తప్పవా? టీడీపీలో జనసేనను మెర్జ్ చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీ ఎలా ఉంటుందనే అంశంపై ప్రస్తుతం హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. 2019నాటికి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని పవన్ కల్యాణ్ తన పార్టీని ప్రమోట్ చేసుకుంటున్న నేపథ్యంలో.. టీడీపీకి వత్తాసు పలికితే మాత్రం పవన్ పార్టీకి గట్టిదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
తన రాజకీయ పార్టీ అయిన జనసేన పవన్ కల్యాణ్ పార్టీ ప్రమోషన్‌లో ఉన్నప్పటికీ.. టీడీపీతో కలిసుంటే మాత్రం మంచి గుర్తింపు లభించదని వారు చెప్తున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో పాలుపంచుకోని పవన్ కల్యాణ్ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటం.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గౌరవించడం ద్వారా పవన్ పార్టీకి కష్టాలు తప్పవంటున్నారు. 
 
పవన్ టీడీపీకే మద్దతు పలికితే జనసేన పార్టీకి క్రేజ్ ఉండదంటున్నారు. ఇప్పటికే వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి మూడో స్థానమే దక్కనుంది. టీడీపీ-బీజేపీ-జనసేన లోక్ సత్తా హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అలాగే పవన్ కల్యాణ్ 2019లో టీడీపీ గెలుపుకు కృషి చేస్తే మాత్రం పవన్ పార్టీకి కష్టాలేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
మరోవైపు పవన్ పార్టీపై వేరొక వాదన కూడా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిలా తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు.. జనసేనను కూడా పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో మెర్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే 2019లో టీడీపీతో పాటు జనసేనకు కూడా సీట్లొస్తాయని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.