బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By venu
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (13:12 IST)

ట్విట్టర్ పిట్ట మళ్లీ కూసింది... తెరాస, వైఎస్సార్సీపీలే భేష్ అంది...

పదిహేను లక్షల డెబ్బై ఏడువేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది అనుచరులతో ట్విట్టర్‌లో 292 (ఇప్పటివరకు) ట్వీట్లతో విరాజిల్లుతున్న జనసేనాధిపతి ప్రత్యేకహోదాపై మరోసారి తన కీబోర్డుకు పని చెప్పారు.

పదిహేను లక్షల డెబ్బై ఏడువేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది అనుచరులతో ట్విట్టర్‌లో 292 (ఇప్పటివరకు) ట్వీట్లతో విరాజిల్లుతున్న జనసేనాధిపతి ప్రత్యేకహోదాపై మరోసారి తన కీబోర్డుకు పని చెప్పారు. ఈ మధ్యే జగన్మోహన్‌రెడ్డి వైపుకు వీస్తున్న ఈ ట్విట్టర్ పవనం ఇప్పుడు తెలంగాణలోని ఎంపీలను కూడా మోసే పని ఎత్తుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో నినాదాలు చేసిన కేశవరావు, ఆనందభాస్కర్‌లను పవన్ కళ్యాణ్ ఆకాశానికెత్తేశారు.
 
ప్రత్యేక హోదాను దక్కించుకునేందుకు వైఎస్సార్సీపీ సైతం తన వంతు ప్రయత్నాన్ని చేస్తోందంటూ పేర్కొన్న పవన్ తెలుగుదేశం ఎంపీలకు కొన్ని చురకలంటించారు. పనిలోపనిగా వర్ణవివక్ష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తరుణ్ విజయ్‌పైనా ఆరోపణాస్త్రాలు సంధించేసారు పవన్. భారతదేశంలో దిగువ భాగాన నివసించే తాము దేశానికి పునాదిలాంటి వారమని వ్యాఖ్యానించారు.
 
వాళ్లనీ, వీళ్లనీ పొగుడుతూ, తెగుడుతూ కాలం గడిపేస్తున్న పవన్ తన వంతుగా ఏం చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎన్నికల్లో పోటీ చేయకుండానే, అధికారంలో పాలుపంచుకోకుండానే జగన్‌ను, కాంగ్రెస్‌ను ఓడించేందుకుశాయశక్తులా భాజపాను, తెదేపాను ఆకాశానికెత్తేసిన పవన్ ఇప్పుడు వాళ్లే మొండిచెయ్యి చూపడంతో దిక్కుతోచని స్థితిలో ట్విట్టర్‌కు, సినిమాలకు పరిమితం అయిపోవడం తెలిసిన విషయమే.