Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబోయ్ సుజనా మా కొద్దు... ఎవరన్నారో తెలుసా..!

సోమవారం, 15 మే 2017 (12:42 IST)

Widgets Magazine

కేంద్రమంత్రి సుజనాచౌదరి.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు. అందుకే ఏకంగా కేంద్రమంత్రి పదవినే వచ్చేటట్లు చేశాడు. పార్టీకి ఎప్పుడు ఎంత ఫండ్స్ కావాలన్నా.. వెంటనే ఇచ్చేస్తుంటారు సుజనా చౌదరి.. అధికారంలో లేనప్పుడు కూడా తెదేపాని ఆదుకుంది ఈయనే. అందుకే సుజనా అంటే బాబుకు ఇష్టం. పార్టీలో నేతలను బుజ్జగించడంలోనూ సుజనకు ఒక ప్రత్యేకత ఉంది. 
 
అందుకే ఎవరైనా ఎప్పుడైనా అలిగితే వెంటనే సుజనా రంగంలోకి దిగుతాడు. కానీ ఈసారి సుజనా చౌదరికే పెద్ద చిక్కొచ్చి పడింది. అదే కేంద్ర మంత్రి పదవి పోవడం. అసలు సుజనాను ఆ పదవి నుంచి తొలగించాల్సినంత అవసరం ఎందుకొచ్చిందంటారు.
 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సుజనాచౌదరికి కేంద్రమంత్రి పదవి దక్కింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేబినెట్‌లో సుజనా చోటు దక్కించుకుని కొనసాగారు. కేంద్రమంత్రి పదవి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇక సుజనా బ్యాంకులకు డబ్బులను ఎగవేత ప్రారంభించాడు. ఒకటి రెండు కాదు కోట్ల రూపాయల డబ్బులను సుజనాచౌదరి ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. 
 
కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సుజనా ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇది ఇప్పటిది కాదు. ఎన్నో నెలలుగా జరుగుతున్న తతంగం. మోడీకి ఇదంతా నచ్చదు. తన కేబినెట్‌లోని మంత్రులపై ఎవరు కూడా ఎలాంటి ఆరోపణలు చేయకూడదన్నది మోడీ ఉద్దేశం. అయితే ఇప్పటికే మరో విజయమాల్యా లాగా సుజనా బ్యాంకులకు డబ్బులను ఎగ్గొడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుంటుండడంతో మోడీకి కోపమొచ్చిందట. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసిన బాబుకు ఇదే విషయాన్ని ప్రధాని చెప్పారట.
 
ఒక్కసారిగా ప్రధాని నోట నుంచి ఆ విషయం బయటకు రాగానే ఆశ్చర్యపోయారట బాబు. ఎలాగైనా సుజనా నుంచి బ్యాంకులకు డబ్బులు కట్టించి ఆ తర్వాత మోడీకి దగ్గర చేయాలన్నదే బాబు ఆలోచన. ఇదే విషయాన్ని సుజనాకు తెలిపారట. అయితే సుజనా అంత డబ్బులను కట్టే పరిస్థితులో మాత్రం లేరట. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం అమిత్ షానే డీల్ చేస్తున్నాడట. సుజనా వ్యవహారాన్ని త్వరగా చక్కదిద్దమని బాబుకు ఎప్పటికప్పుడు అమిత్ షా గుర్తు చేస్తున్నారట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ధర్నా చౌక్ వద్ద డిష్యూం.. డిష్యూం... పడిన రాళ్లు... పగిలిన తలలు... ఖాకీల లాఠీచార్జ్

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను కొనసాగించాలని ధర్నా చౌక్ పరిరక్షణ ...

news

సైబర్ దాడులకు అమెరికానే కారణం.. టూల్ అక్కడే తయారైంది: మైక్రోసాఫ్ట్ ఫైర్

ప్రపంచంలో తొలిసారిగా అతిపెద్ద సైబర్ అటాక్ జరిగేందుకు ప్రధాన కారణం అమెరికా సర్కారేనని ...

news

అనుమానం పెనుభూతమై... పెళ్లి కుమార్తెను వివస్త్ర చేసిన వరుడు బంధువులు... ఎక్కడ?

అనుమానం పెనుభూతమైంది. బొల్లి వ్యాధి ఉందన్న అనుమానంతో పెళ్లి కుమార్తెను వరుడు బంధువులు ...

news

దృశ్యం సీన్ రిపీట్.. కట్టుకున్న భార్యను కడతేర్చి.. అపార్ట్‌మెంట్లోనే పాతిపెట్టిన భర్త..

కట్టుకున్న భార్యను ఓ కసాయి భర్త కడతేర్చాడు. దృశ్యం సినిమాలో హీరో ఇంటి పెరట్లో పోలీసు ...

Widgets Magazine