శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PYR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (17:13 IST)

రానున్నది కరెంటు కోత... బిల్లుల మోత..

ఇప్పటి వరకూ ఎటువంటి కరెంటు కష్టాల్లేవని సంబరపడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాబోవు సమ్మర్ లో కరెంటు కోతలు దడ పుట్టించనున్నాయి. అది విధంగా బిల్లులు వణికించనున్నాయి. సామాన్యుడి నడ్డి విరిచేందుకు, డిస్కంలు, జెన్కోలు కలసి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆ ప్రతిపాదనలు శరవేగంతో రూపుదిద్దుకుంటున్నాయి. వివరాలివి. 
 
డిస్కంలు తమ వార్షికాదాయాన్ని,వ్యయాన్ని ఇఆర్సీ ఛైర్మన్‌ ఎదుట పెట్టాయి. సదరు డిస్కంలు ఇచ్చిన నివేదిక లేదా బ్యాలెన్స్ షీటులో రెవెన్యూ లోటు రూ. 7,716 కోట్లు ఉన్నట్లు తేటతెల్లం చేశాయి. అంటే ఆ మొత్తం సామాన్య జనం నుంచి రాబట్టేందుకు అనుమతి కోరేందుకే ఈ బ్యాలెన్స్ షీటు సమర్పణ అన్నమాట. అన్నీ లెక్కగట్టి మొత్తం ఖర్చును జనంపైకి వేస్తే వారి నుంచి  15. 5 శాతం విద్యుత్‌ చార్జీలు పెంచక తప్పదు. ఇవీ డిస్కంలు సంకేతాలు.
 
చార్జీల పెంపు ప్రాతిపాదనలు ఇచ్చేందుకు మరింత గడువు కోరాయి. వినియోగించే ప్రతి యూనిట్‌కు రూ. 5.99 పైసలు ఖరీదు ధరగా చూపాయి.  గతేడాది వచ్చిన భారాన్ని రూ. 2,004 కోట్లుగా గుర్తించారు. ఇది 2015-16 లో వినియోగదారులపై వేయనున్నాయి. యూనిట్‌కు సరాసరి రూ. 4.44 ఆదాయం వస్తుందని డిస్కంల అంచనా. ప్రస్తుత టారిఫ్‌ 2015-16లోనూ అమలైతే 1.55 లక్షల నష్టం వస్తుందని డిస్కంలు పేర్కొన్నాయి. 
 
ఇలా లెక్కలపై లెక్కలు గట్టి రూ. 7, 716కోట్లను జనం ముక్కుపిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మరో ఖజానా ఖాళీ.. ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు రిక్త హస్తాలు చూపుతున్నారు. ఆయన సబ్సిడీని  ఎలా ఇస్తారో చూడాల్సి ఉంది. ఇక అలా చేతులెత్తేస్తే.. సామాన్యుడి పని గోవిందా గోవిందా...