శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: శనివారం, 31 డిశెంబరు 2016 (21:54 IST)

చంద్రబాబు, జగన్‌ల పులివెందుల రాజకీయాలు ప్రజల కోసమా.. పార్టీ కోసమా..?

సంక్రాంతి పర్వదినం సందర్భంగా పులివెందులకు నీరు విడుదల చేస్తున్నాము. వైఎస్‌ కుటుంబం చేయని పనిని తాము చేస్తున్నాము అంటూ అధికారపార్టీ నేతలు ప్రకటనలు ఒకవైపు, పులివెందులకు నీటిని విడుదల చేయాలంటూ ప్రతిపక్ష నేత జగన్‌ ధర్నా మరోవైపు జరిగాయి. ఇరువురు నేతలు పుల

సంక్రాంతి పర్వదినం సందర్భంగా పులివెందులకు నీరు విడుదల చేస్తున్నాము. వైఎస్‌ కుటుంబం చేయని పనిని తాము చేస్తున్నాము అంటూ అధికారపార్టీ నేతలు ప్రకటనలు ఒకవైపు, పులివెందులకు నీటిని విడుదల చేయాలంటూ ప్రతిపక్ష నేత జగన్‌ ధర్నా మరోవైపు జరిగాయి. ఇరువురు నేతలు పులివెందులకు తాము న్యాయం చేశాము అంటే తాము చేశాము అంటూ మాటల యుద్థంతో తోచిన ప్రకటనలు చేస్తున్నారు. పనిలో పనిగా రాయలసీమ సస్యశ్యామం చేస్తున్నామంటూ ప్రతినెలా చేస్తున్న ప్రకటనలే మళ్ళీ చేస్తున్నారు. మరోవైపు రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తమకు నికర జలాలు కావాలని రైతు సంఘాలు, సీమ నవతరం ఎప్పటిలాగే తమ నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు. ఇంతకీ గండికోట కేంద్రంగా సీమ ప్రజలను మరిచి అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న పులివెందుల రాజకీయాలను పరిశీలిస్తే..
 
పులివెందుల రాయలసీమలో ఒక భాగం. సీమ నీటి సమస్యను పరిష్కరించడం ద్వారానే పులివెందుల నీటి సమస్య పరిష్కరించడబడుతుంది. నాలుగు సీమ జిల్లాలకు త్రాగు, సాగు నీటి సమస్యకు పరిష్కారం హెచ్‌ ఎల్‌సీ, ఎల్‌ ఎల్‌ సీ ప్రాజెక్టులు కాకుండా గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌ బిసీ ప్రాజెక్టులు ప్రధానమైనవి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడంతోబాటూ వాటికి నికర జలాలు కేటాయించడం, శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు కనీస నీటిమట్టం ఉండేలా చూడడం అందుకు ఆటంకంగా ఉన్న జిఓ నెంబర్‌ 69ని రద్దు చేయడం. సిద్ధేశ్వరం గుండ్రేవుల, సమాంతర కాలువ నిర్మాణం వెంటనే చేపట్టడం లాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం ద్వారానే రాయలసీమకు, అందులో భాగంగా పులివెందుల, కుప్పంకు నీరు ఇవ్వడం సాధ్యం అవుతుంది. కాని అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం వీటి జోలికి వెళ్ళకుండా సీమ నీటి సమస్యను పరిష్కారం చేస్తున్నట్లు ప్రజలకు తాత్కాలిక ప్రయోజన చర్యలు చేపడుతూ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి.
 
గండికోట రాజకీయం. ఇప్పుడు వివాదం గండికోట ద్వారా పులివెందులకు నీటి విడుదల ఇస్తామని, అధికార పార్టీ ఇవ్వడం లేదని ప్రతిపక్షం చేస్తున్న వాదనలు ఎన్ని ఉన్నా అసలు విషయం మాత్రం మరోలా ఉంది. సీమకు నీరు అందించే నాలుగు ప్రాజెక్టులలో ఒకటి గాలేరు - నగరి, కడప చిత్తూరుజిల్లాలకు నీరు అందించే ప్రధాన కాలువలు. స్వర్గీయ రామారావు దీనికి శంఖుస్థాపన చేస్తే తదుపరి పాలకులు పట్టించుకోలేదు. 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ కాలంలో ఈ ప్రాజెక్టు పనులకు మోక్షం కలిగింది. రాయలసీమలోని అన్ని జిల్లాల నీటికి మూలం పోతిరెడ్డిపాడు అయినట్లే పులివెందులకు కూడా అదే మూలం.
 
పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి ఎస్‌ ఆర్‌ బీసీ, గాలేరు, నగరి, తెలుగు గంగ కుందూ ద్వారా కెసీ కెనాల్‌కు నీరు అందుతుంది. ఇప్పుడు చర్చకు మూలం అయిన పులివెందులకు కూడా గాలేరు, నగరి ద్వారానే నీరు అందివ్వాలి. పోతిరెడ్డి పాడు ద్వారా పాముల పాడు, బనకచర్ల, గడివాములు, గోరకల్లు, పాణ్యం, బనగానపల్లి,అవుకు, మైలవరం ద్వారా గండికోటకు నీరు వస్తుంది. గండికోటకు శంఖుస్థాపన చేసిన బాబు దాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే గండికోటను పూర్తి చేశారు. గండికోటకు కడపజిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఎద్దుల ఈశ్వర్‌ రెడ్డి పేరును పెట్టారు. ఈ ప్రాజెక్టులో నాలుగు టిఎంసిలు చేరితేనే లిఫ్ట్ చేయడం సాధ్యమవుతుంది. అక్కడి నుంచి కొండాపురి, సింహాద్రి, చిత్రావతి, లింగాల, పులివెందుల మీదుగా వేంపల్లి చేరుకోవడం ద్వారా కడపజిల్లాలో గాలేరునగరి లక్ష్యం నెరవేరుతుంది.
 
ఈ ప్రాజెక్టు కడప తరువాత చిత్తూరు జిల్లా ప్రయోజనాలను కూడా తీర్చాలి. ఇప్పటివరకు జరిగిన పనులలో 80శాతం వైఎస్‌ కాలంలో జరిగినవే. గోరకల్లు, అవుకు, మైలవరం, గండికోట, చిత్రావతి లాంటి రిజర్వాయర్‌లను వైఎస్‌ పూర్తి చేశారు. కాలువ నిర్మాణం మాత్రమే కొంత మిగిలింది. అయినా కడపకు నీరు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఇంతకు ముందే ప్రస్థావించినట్లు నీరు రావాల్సింది. పోతిరెడ్డిపాడు నుంచి కాకపోతే రెండు సమస్యల వైఎస్‌ కాలం నాటికి ఇబ్బందిగా ఉంది. గతంలో వైఎస్‌ 80శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులలో మిగిలిన భాగం పూర్తి చేసి నీరు ఇవ్వగలిగితే సంతోషమే. కానీ అది ఎన్నటికి జరుగుతుందన్నదే ప్రశ్న.