Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూలై 3న రజినీ రాజకీయ ప్రవేశం... అల్లుడు ధనుష్‌కి ఎందుకు అంత ఆత్రం?

బుధవారం, 7 జూన్ 2017 (12:23 IST)

Widgets Magazine
rajinikanth

దక్షిణాది రాష్ట్రాల సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ వచ్చిన రజినీ జూలై 3వ తేదీన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసేసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకున్న తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోజే పార్టీ పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది. 
 
అయితే అభిమానుల మధ్య కాకుండా నేరుగా తన ఇంటిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సింపుల్‌గానే చేయాలన్నది రజినీ ఆలోచన. ఎక్కడ కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రావాలని రజినీ నిర్ణయించుకున్నారట. రజినీకి ఏ విషయమైనా ముందు నుంచి ప్రశాంత వాతావరణంలోనే జరుపుకోవడం అలవాటు. రాజకీయాల్లోకి వెళ్ళే ముందు కూడా అలాగే ఉండాలన్నది రజినీ అభిప్రాయం.
 
తలైవా రజినీ రాజకీయాల్లోకి రావాలని గత 20 సంవత్సరాలుగా అభిమానులు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల అయితే రజినీ అభిమానులు తలైవా భారీ పోస్టర్లు వేసి రజినీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారం కాస్త రజినీకి కోపం తెప్పించింది. రాజకీయాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేని రజినీ అభిమానులను దూరంగా ఉంచడం ప్రారంభించాడు. అయితే జయలలిత మరణం తరువాత అభిమానుల నుంచి మళ్ళీ అదే డిమాండ్. దీంతో రజినీ ఆలోచనా సరళి మారింది. నేరుగా అభిమానులతోనే సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అంతలోనే తమిళ మున్నేట్ర పడై, నామ్ తమిళన్ పార్టీలు రజినీ రాజకీయాల్లోకి రాకూడదని చేసిన రాద్దాంతంతో వెనక్కి తగ్గారు. 
 
అంతేకాదు ముంబైలో కాల సినిమా షూటింగ్‌లో ఉన్న రజినీ రాజకీయాలపై మెల్లమెల్లగా అడుగులు వేయడం ప్రారంభించారు. అయితే రజినీ సోదరుడు ఉన్నట్లుండి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రజినీ రాజకీయాల్లోకి వస్తున్నాడని చెప్పాడు. అయితే రజినీ మాత్రం ఎక్కడా దానిపైన మాట్లాడలేదు. స్వయంగా రజినీకి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంది. 
 
రజినీ రాజకీయాల్లోకి రావాలని ఆయన అల్లుడు ధనుష్ కూడా కోరుకుంటున్నారు. ఐతే అల్లుడు ధనుష్ మామ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ మరీ అంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారంటూ కొందరు చర్చ మొదలెట్టాశారు. మరోవైపు తన రాజకీయ అరంగేట్రంకు సంబంధించి కాల షూటింగ్‌లో ఉన్న రజినీ నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా చర్చించారట. జూలై 3వ తేదీ చాలా బాగుందని.. ఆరోజు రాజకీయాలపై ప్రకటన చేస్తానని చెప్పినట్లు సమాచారం. 
 
తలైవా ఏ నిర్ణయం తీసుకున్నా ఒకసారి కాదు.. వందసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నది కుటుంబ సభ్యులకు తెలుసు. అందుకే ఒకే అనేశారట. అయితే ఇప్పటికే తలైవా వెంట వెళ్ళడానికి కొంతమంది ఎమ్మెల్యేలు సిద్థంగా కూడా ఉన్నారు. వారిని కలుపుకుని రజినీ ముందుకు వెళతారా..లేక కొత్త రక్తంతో కొత్త వారిని పార్టీలోకి తీసుకుంటారన్నది త్వరలో తేలిపోనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బరితెగించిన పాక్.. చైనాకు గిల్గిత్ భూముల్ని అమ్మేస్తుంది.. చైనా తక్కువేం తినలేదు..

చైనాలోని పలు కంపెనీలకు, చైనా ఆర్మీకి భూములను తెగ అమ్మేస్తున్నారంటూ గిల్గిత్-బాల్టిస్థాన్ ...

news

ల్యాప్‌టాప్‌లో సూసైడ్ నోట్.. బతకాలని లేదు.. తమ్ముడూ వారిని బాగా చూసుకో?

ఓ యువకుడికి బతకాలనించలేదు. అందుకే అమ్మానాన్నలను బాగా చూసుకో తమ్ముడూ అంటూ ల్యాప్‌టాప్‌లో ...

news

మేఘాలయాలో బీఫ్‌పై నిషేధమే లేదంటున్న బీజేపీ.. కానీ యూపీలో గూండాచట్టం కింద?

మేఘాలయాలో బీఫ్‌పై అసలు నిషేధమే లేదంటున్న బీజేపీ యూపీలో మాత్రం సీన్ మార్చేసింది. యూపీలో ...

news

కుమార్తె పెళ్లిపై గొడవ.. పోటీపడి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

కన్నబిడ్డ వివాహంపై భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరికి ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన ...

Widgets Magazine