శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PYR
Last Updated : గురువారం, 12 ఫిబ్రవరి 2015 (11:30 IST)

ఎర్రచందనం వయాగ్రాలా పని చేస్తుందా..! అంగస్తంభన సమస్యకు పరిష్కారమా..!!

బంగారమైనా పబ్లిక్ గా అమ్ముకుంటే తప్పు లేదేమోగానీ, గ్రాము ఎర్రచందనం కూడా పబ్లిక్ గా అమ్మడానికి లేదు. ఏం? ఎందుకు? అంటే అది అరుదైన వృక్ష జాతికి చెందినది. అందుకే దాని క్రయవిక్రయాలపై భారతదేశం నిషేధం విధించింది. మరి చైనా ఎందుకంత ఎగబడి కొంటోంది? ఇది చాలా కాలం భారతీయులకు అంతు చిక్కని విషయం. మనిషిలో శృంగార శక్తిని పెంచే ఔషద గుణాలు ఇందులో ఉన్నాయా? అంటే అక్కడ జరుగుతున్న ప్రయోగాలు అదేనని చెబుతున్నాయి. ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు కూడా ఇదే పని పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
ఎర్రచందనం శేషాచల అడవులలో లభించే అరుదైన వృక్ష జాతికి చెందినది. ప్రపంచంలో అక్కడక్కడా ఈ జాతి ఉన్నప్పటికీ ఇంత క్వాలిటీ ఉన్న రకం ఎక్కడా కనిపించదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో కేవలం రాయలసీమ జిల్లాలలోని శేషాచల అడవులలో మాత్రమే విస్తారంగా లభిస్తుంది. దీనిని స్మగ్లర్లు విచ్చలవిడిగా నరికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. చైనా, జపాన్, మలేషియా వంటి దేశాలు దీనిని కేవలం టన్ను రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
 
అయితే ఇప్పటి వరకూ కేవలం ఇంటికి అవసరమయ్యే సామాగ్రిని తయారు చేసుకోవడానికి, సంగీత సాధనాలను తయారు చేసుకోవడానికి మాత్రమే కొనుగోలు చేస్తుండే వారని తెలిసింది. కొన్నాళ్ళు అందులో రేడియోధార్మిక పదార్థం ఉందనీ, దానిని బయటకు తీసి పేలుడు పదార్థాల తయారీలో వినియోగించే వారని చెప్పేవారు. రంగుల తయారీలో కూడా వినియోగిస్తారనే వారు. అయితే అది కూడా తప్పనేనని తెలుస్తోంది. దీనిని నీటిలో నానబెట్టి తాగితే రక్తపోటు తగ్గుతుందని కొందరు అలా కూడా చేస్తారు. 
 
అయితే మరో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వస్తోంది. చైనీయులు దీనని వయాగ్రాలా వినియోగిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సరియైన ఆధారాలు లేనప్పటికీ.. అంగస్తంభన అధికంగా ఉన్న మగవారికి దివ్య ఔషదంలా పని చేస్తుందని తెలుస్తోంది. దీనిలోని పదార్థాలను వెలికి తీసి తయారు చేసిన మందు మగవారిలో అంగస్తంభన సమస్యను నివారించందని తెలుస్తోంది. అందుకోసమే దీనిని విరివిగా కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. 
 
అయితే అసలు ఈ వృక్షంలో ఏముందనే విషయాన్ని తేల్చడానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఓ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టును ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకు అప్పగించింది. వారు ఏడాదిపాటు వృక్షంలోని ఆకులు, కాండం, వేర్లు, తదితర భాగాలను పరిశీలించనున్నారు. అంతే కాదు. వివిధ సీజన్లలో ఇది తన గుణాలను ఏ విధంగా మార్చుకుంటుందో కూడా పరిశోధన చేసి శృంగార ఔషద గుణాలను వెలికి తీయనున్నారు.