శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (21:17 IST)

పళణి స్వామికి పదవీ గండం తప్పదా? శశికళ గేమ్ ప్లాన్ రెడీ...

పళణి స్వామి. గత రెండురోజులుగా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు. అన్నాడిఎంకే ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత ఆయన. అంతేకాదు శశికళకు నమ్మినబంటు. అందుకే శశికళ ఏకంగా పళణి స్వామిని సిఎం చేసింది. కలలో కూడా పళణిస్వామి తాను సిఎం అవుతానని అనుకోనుండ

పళణి స్వామి. గత రెండురోజులుగా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు. అన్నాడిఎంకే ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత ఆయన. అంతేకాదు శశికళకు నమ్మినబంటు. అందుకే శశికళ ఏకంగా పళణి స్వామిని సిఎం చేసింది. కలలో కూడా పళణిస్వామి తాను సిఎం అవుతానని అనుకోనుండడని పార్టీ వర్గాల్లో చెబుతున్నారు. అయితే జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పదవి ఆయన్ను వరించింది. ఇదంతా బాగానే ఉన్నా పళణిస్వా మికి ప్రస్తుతం పదవీ గండం స్పష్టంగా కనబడుతోంది. తనకు దక్కిన సిఎం పీఠం త్వరలో ఊడిపోవడానికి పన్నీరు సెల్వమో, దీపానో.. కాదు. సాక్షాత్తు ఆయన పార్టీలోని వ్యక్తే. శశికళకు బంధువే. ఆయనే టిటివి దినకరన్‌.
 
అదెలాగంటారా.. కుటుంబ పాలన. తనకు పదవి దొరకకున్నా... తన ప్రత్యర్థికి ఆ పదవి రాకూడదన్న ఉద్దేశంతో ఎంతో చాకచక్యంగా పావులు కదిపి పళణి స్వామిని శాసనాసభపక్ష నేతగా ఎన్నుకునేలా చేసింది శశికళ. ఇదంతా బాగానే ఉంది. కానీ అక్కడే మరో ట్విస్ట్ పెట్టారు. అదే టిటివీ దినకరన్..శశికళ అన్న కొడుకు ఈయన. ఉన్నట్లుండి ఆయన్ను అన్నాడిఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆ తరువాత ఆర్‌కే నగర్ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. కారణం.. ఆర్కే నగర్‌లో జయలలిత పోటీ చేసిన స్థానం కాబట్టి. తనకు రాజకీయంగా పోటీ చేసే అవకాశం లేకపోయినా తన కనుసన్నల్లోనే పార్టీ, ప్రభుత్వం నడవాలన్నది శశికళ ఉద్దేశం.
 
అందుకే ఆర్కే నగర్‌లో పోటీ చేయమని దినకరన్‌కు చెప్పిందట శశికళ. జూన్ లోపు ఉప ఎన్నికలు కూడా ఆర్‌కే నగర్‌లో నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ దినకరన్ ఉప ఎన్నికల్లో గెలిస్తే మాత్రం ఇక పళణిస్వామి పని అయిపోయినట్లే. ఉన్నఫలంగా శాసనసభాపక్ష నేతగా దినకరన్‌ను ఎన్నుకుని సిఎం పదవిలో ఆయన్నే కూర్చోబెట్టేస్తారు శశికళ. ఇదంతా జైలు నుంచి శశికళ వేస్తున్న ఎత్తులు. తన కుటుంబ సభ్యులే సిఎంగా ఉండాలన్నది శశికళ కోరిక.
 
ప్రస్తుతం దినకరన్ ప్రజాప్రతినిధినిగా ఎన్నిక కాలేదు కాబట్టి వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పళణిస్వామి కేవలం మూడు నెలల వరకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయన మరో పన్నీర్ సెల్వం కాక తప్పదని అంటున్నారు.