మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (21:50 IST)

కొరకరాని కొయ్యలా పన్నీర్ సెల్వం... శశికళ చేసిన తప్పులు ఇవే... ఆశలు గల్లంతే

నిన్నటివరకు తనకు వంగివంగి నమస్కారాలు చేసిన ఓ.పన్నీర్ సెల్వం ఇపుడు కొరకరాని కొయ్యలా మారడాన్ని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జీర్ణించుకోలేక పోతోంది. దీంతో తాను అనుకున్నది నల్లేరుపై నడకలా

నిన్నటివరకు తనకు వంగివంగి నమస్కారాలు చేసిన ఓ.పన్నీర్ సెల్వం ఇపుడు కొరకరాని కొయ్యలా మారడాన్ని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జీర్ణించుకోలేక పోతోంది. దీంతో తాను అనుకున్నది నల్లేరుపై నడకలా సాగిపోతుందని భావించిన శశికళకు ఇపుడు తత్వం బోధపడుతోంది. 
 
గంటల్లో తేలిపోతుందనుకున్న వ్యవహారం రోజులు గడుస్తున్నా కొలిక్కిరాలేదు. అంతా అనుకున్నట్లు జరిగుంటే శశికళ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టి నాలుగు రోజులు గడిచిపోయేవి. పన్నీరు సెల్వం మరోసారి మంత్రిగా తన పాత జీవితంలోకి వెళ్లిపోయేవారు. కానీ అలా జరగలేదు. పరిస్థితి ఒక్కసారి అడ్డం తిరిగింది. పన్నీరు మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి 40 రెండు నిమిషాలు మౌనం పాటించి నోరు విప్పడంతో చిన్నమ్మ కలలు కల్లలయ్యాయి. 
 
33 ఏళ్ల నుంచి పెంచుకుంటూ వచ్చిన ఆశలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎందుకిలా జరిపోయిందని ఆలోచించుకోవాడానికి నాలుగు రోజులు తర్వాతగానీ ఆమెకు బోధపడలేదు. వీటన్నింటికీ కారణం... ఆమె దూకుడు, వ్యూహం లేకపోవడం, అంతా రహస్యంగా చేయడం వంటి మూడు ప్రధాన తప్పిదాలు సస్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
ఇందులో తొలి తప్పు... పారదర్శకత. శశికళ జీవితంలో ఆది నుంచి పారదర్శకత లేదు. ఏదీ చేసినా అంతా రహస్యంగా చేయాలని భావించారు. అలానే చేస్తూ వచ్చారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పటి నుంచి అంతా రహస్యంగానే పూర్తి చేసింది. జయ అనారోగ్యంపై పార్టీ తరపున కానీ, అమ్మ తరుపున కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేశారు. జయలలిత మరణంపై న్యాయమూర్తులే అనుమానం వ్యక్తం చేశారంటే.. కారణం జయ విషయంలో శశికళ వ్యవహరించిన తీరే. ఇవన్నీ చాలవు అన్నట్లు జయ మరణించడానికి కొన్ని గంటల ముందు ఎమ్మెల్యేలతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఇవన్నీ శశికళ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి.
 
శశికళ రెండో తప్పు. తొందరపాటు. శశికళ కొంప ముంచుతోంది ఆమె తొందరపాటే. రాజకీయాల్లో ఓపిక, సహనం, శాంతి,  నిదానం ఎంతో ముఖ్యం. అధికారం కోసం గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు కూడా ఓపిక శశికళలో ఏ కోశాన కనిపించలేదు. జయలలితలా చీర కట్టుకుంటే, ముడి వేసుకుంటే.. నుదుట బొట్టుపెట్టుకుంటే అమ్మలా అయిపోతానని అనుకోవడం అనాలోచిత చర్యగా పేర్కొనవచ్చు. 
 
శశికళ మూడో తప్పు. వ్యూహ లోపం. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన మరుక్షణం నుంచే ముఖ్యమంత్రి పీఠం కోసం తహతహలాడిపోయింది. చిన్నమ్మ సీఎం అంటూ తన అనుచరులతో లేఖ రాయించుకున్నారు. సీఎం సీటు కోసం ఆమె వేసిన ఎత్తుగడ బాగానే ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొకొనాలనే దానిపై క్లారిటీ లేకపోవడం. పన్నీరు సెల్వంతో రాజీనామా చేసించి శాసనసభాపక్షనేతగా తాను ఎన్నికైతే ప్రమాణాస్వీకారం చేయచ్చేనే భావించారే తప్ప పార్టీలో చీలిక వచ్చిన పన్నీరు ఎదురు తిరిగినా, మరోరకమైన సమస్య వచ్చిన దాన్ని ఎలా డీల్ చేయాలనే దానిపై శశికళకు క్లారిటీ లేదు. పైగా, పన్నీరు పక్షాన కేంద్రం, ప్రతిపక్షం ఉన్నాయని తెలిసిన బలవంతంగా తెగేవరకు లాగారు. ఫలితంగా ఇపుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారే పరిస్థితిని కల్పించుకున్నారు.