గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (17:39 IST)

మోదీజీ... స‌వ‌ర‌ణ‌ల లెక్కేంది..? పెట్రోల్ ధ‌రల త‌గ్గాల్సిందెంత...? త‌గ్గిందెంత‌...?

  • త‌గ్గాల్సింది... రూ 4. త‌గ్గించింది 30 పైస‌లా..!?
  • పెట్రోల్ రూపంలో జ‌నం ర‌క్తం తాగుతున్నారా...
  • ఆదాయమే అసలు రహస్యం 
 
పెట్రోల్ ధ‌ర రూపాయ త‌గ్గినా స‌ర్కారుకు ఎక్క‌డ‌లేని క్రేజ్ పెరిగిపోతుంది. అంత‌కుముందు ఎన్నిమార్లు బాదినా జ‌నం అంత‌గా ప‌ట్టించుకోరు. కానీ పైస‌ల్లో త‌గ్గించినా స‌రే ప‌ర్వాలేదు. త‌గ్గించేశార‌ని తెగ సంబ‌ర‌ప‌డిపోతారు. ఇది ఎప్ప‌టినుంచో వ‌స్తున్న ఆన‌వాయితీ. కానీ లెక్క‌లు తీస్తే మాత్రం అబ్బో అంత‌ ఉందా...! అనిపిస్తుంది. ఆయిల్ కంపెనీలు ధ‌ర స‌వ‌ర‌ణ నియ‌మం ఏం చెబుతుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో పెట్రోల్ లేదా డీజిల్ బారెల్ ధ‌ర త‌గ్గితే ఆ మేర‌కు త‌గ్గింపు పెరిగితే ఆ మేర‌కు పెంపు జ‌ర‌పాలి. కానీ అలా జ‌రుగుతోందా..! అంటే కాద‌నే వాద‌ని వినిపిస్తోంది. రూపాయ‌ల్లో త‌గ్గాల్సిన చోట పైస‌ల్లో త‌గ్గించి పైస‌ల్లో పెర‌గాల్సిన చోట రూపాయల్లో పెంచేస్తున్నారు. తాజా ఏం జ‌రిగింది. చూద్దాం రండీ..
 
కేంద్రం పెట్రోల్ ధరను లీటరుపై 30 పైసలు తగ్గించింది. డీజ‌ల్ ధ‌ర 71 పైస‌లు త‌గ్గించింది. ఇది సంతోష‌మే. త‌గ్గిన‌ భారం ఎంతైనా త‌గ్గిన‌ట్టే. అయితే లెక్కేందో చూద్దాం. 2007-08 మద్య కాలంలో ఒక్క బేరల్‌ క్రూడాయిల్ ధ‌ర అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు 140 డాలర్లు ఉంటే అప్పుడు మనదేశంలో లీటరు పెట్రోల్ దర రూ. 67. అదే క్రూడాయిల్ ధ‌ర ప్రస్తుతం 61 డాలర్లు. కాని పెట్రోల్ ధ‌ర తగ్గకపోగా పెరిగిందెందుకు? గడిచిన 7 సంవత్సరాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విపరీతంగా పెంచాయి అన్నది స్పష్టంగా అర్థ‌మవుతుంది. గతం సరే ప్రస్తుతం మోదీ చేసిందేంటి? 
 
జున్ నెలలో క్రూడాయిల్ ధ‌ర 64 డాలర్లు. అప్పుడు లీటరు రూ. 77.10. రెండు రోజులక్రితం 30 పైసలు తగ్గించారు. అసలు విష‌యం ఏమిటంటే ప్రస్తుతం క్రూడాయిల్ దర 61 డాలర్లు మాత్ర‌మే. నేడు అమలవుతున్న పన్నులతో పోల్చి చూసినా పెట్రోల్‌పై లీట‌ర‌కు క‌నీసం రూ.4 తగ్గాలి. ఆ మేర‌కు త‌గ్గించారా అంటే లేదు. ప‌న్నుల రూపేణా వారి ఆదాయం కోసం ఇష్టానుసారం పెంచేస్తున్నారు. అభివృద్ది చెందిన ఆస్ట్రేలియాలో లీట‌రు పెట్రోలు రూ. 66, చైనాలో రూ. 72, జపాన్‌లో రూ. 70 ఉంటే మన ప్రక్కన ఉన్న పాకిస్తాన్‌లో రూ. 48, నేపాల్‌లో రూ. 65, శ్రీలంకలో రూ. 60లకే దొరుకుతుంది. కార‌ణం ప్ర‌భుత్వాల తీరు. మ‌న‌దేశంలో దీనిని ఆదాయ‌వ‌న‌రుగా చూడ‌టమే. అంటే ప‌రోక్షంగా ప్ర‌జ‌ల‌తో ప్ర‌భుత్వం వ్యాపారం చేస్తోంద‌న్న‌మాట‌. 
 
1. కేంద్రం పెట్రోల్‌పై పన్నులను ప్రధాన ఆర్థిక వనరుగా భావిస్తుంది. పేరుకు అంత‌ర్జాతీయ ధ‌ర‌ల‌తో పోల్చి చెబుతారే త‌ప్ప త‌గ్గినప్పుడు దానిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు. తీసుకుంటే ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం ప‌డిపోతుంది. వాస్తవానికి మన అవసరాలలో 25 శాతం ముడి ఇంధనం మనదేశంలోనే లభిస్తుంది. దాన్ని కూడా రిలయన్స్ లాంటి సంస్థల‌ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ ధ‌రల ప్రాతిపదికన లెక్కకడుతుంది.
 
2 పైకి తమకు సంబంధం లేదంటూనే విపరీతంగా పన్నులను వేస్తున్నారు. 
 
3 డాలరుతో రూపాయి మారకం రోజురోజుకీ పడిపోతోంది. ఫలితంగా ధ‌రలు పెరుగుతున్నాయి.