Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శోభన్ బాబు - జయలలిత మరణాలు ఒకే రీతిలో జరిగాయా?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (19:35 IST)

Widgets Magazine
shoban babu - jayalalithaa

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న చర్చను చూస్తుంటే గతంలో ఆమె పెళ్లాడినట్లు చెప్పుకుంటున్న శోభన్ బాబు మరణంపై నటుడు బాబూ మోహన్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకువస్తున్నాయి. శోభన్ బాబు ఆయన కుటుంబ సభ్యుల కారణంగా చనిపోయారంటూ బాబూ మోహన్ వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత క్షమాపణలు కోరడం తెలిసిందే. ఇప్పుడు శోభన్ బాబు మాదిరిగా జయలలితను ఆమె చుట్టుపక్కల వున్నవారే మట్టుబెట్టారంటూ తమిళనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది.
 
జయలలిత మృతిపై అన్నాడీఎంకే నేత పాండ్యన్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయెస్‌గార్డెన్‌లో జయలలితతో కొందరు ఘర్షణ పడ్డారని, ఆమెను ఎవరో తోసేయడంతో కిందపడిపోయారని అన్నారు. ఆర్డినెన్స్‌కు సంబంధించి ఇద్దరి మధ్య వాదన జరుగుతున్న సమయంలో సెప్టెంబర్ 22వ తేదీన అమ్మను కిందకు తోసేయడంతోనే ఆమె తీవ్ర గాయాలపాలయ్యారనీ, దాంతో ఆస్పత్రికి తరలించారని.. ఆమెకు ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి కూడా వివరాలు బయటికి పొక్కలేదన్నారు. 
 
అందుచేత జయలలిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని పాండ్యన్‌ డిమాండ్ చేశారు. శశికళకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే అర్హత లేదని ఆయన అన్నారు. కాగా పాండ్యన్‌ చేసిన ఆరోపణలను శశికళ వర్గీయులు కొట్టిపారేశారు. అమ్మను హత్య చేసిన చందంగా పాండ్యన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని శశి వర్గం అంటోంది. 
 
ఇదిలా ఉంటే.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలపై ఆమెకు చికిత్స అందించిన లండన్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు రిచర్డ్ బాలే స్పందించారు. జయ మరణం వెనక ఎటువంటి కుట్ర లేదని, శ్వాస సంబంధమైన ఇబ్బందులు, అవయవాలు దెబ్బతినడం వల్లే ఆమె మృతి చెందారని వివరించారు. ఆమెను బతికించేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జయలలితకు అందించిన చికిత్స పట్ల వైద్యుల సమాధానాలకు ఏమాత్రం పొంతన లేదని వార్తలొస్తున్నాయి. మొత్తమ్మీద జయలలిత మరణంపై జరుగుతున్న చర్చ మరోసారి శోభన్ బాబును గుర్తుకు తెచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
#sasikala #jayalalithaa #sasikalashortcut #sasikalanotmycm #tnsaysno2sasi Jaya Death Shoban Babu Death

Loading comments ...

తెలుగు వార్తలు

news

కీటకాలపై అమితమైన ప్రేమ.. ఆ వీడియోలతో అడ్రియా ఫేమస్.. ఎఫ్‌బీకి 2.70లక్షల లైకులు

సోషల్ మీడియా ప్రభావంతో ఏది తోచితే దాన్ని పోస్ట్ చేయడం.. అభిప్రాయాలను పంచుకోవడం, ఫోటోలను ...

news

మహిళలు ప్యాంట్, షర్ట్ ధరిస్తే ఆ రోగాలు తప్పవ్.. క్యాంటీన్లో తాడు కట్టేస్తే బెస్ట్..

పురుషుల మాదిరిగా దుస్తులు ధరించే బాలికలు పురుషుల్లాలాగానే ప్రవర్తించడం మొదలెడతారని.. వారి ...

news

వాళ్లిద్దరి బాటలో పవన్ కళ్యాణ్... ఏపీ సీఎం పీఠం ఎక్కేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆసక్తి వున్నదో లేదోనన్న సర్వేను ...

news

శశికళకు ప్రజలు ఓట్లేయలేదు... అమ్మ వారసురాలిని ముమ్మాటికీ నేనే : దీప

అన్నాడీఎంకే శశికళ ముఖం చూసి ప్రజలు ఓట్లేయలేదని దివంగత జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ...

Widgets Magazine