Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మంత్రి ఇలాకాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు... చంద్రబాబుకు తలనొప్పి!

శనివారం, 14 జనవరి 2017 (12:50 IST)

Widgets Magazine
bojjala

సాక్షాత్తు మంత్రి ఇలాకాలోనే అధికారపార్టీలలో ఆధిపత్య పోరు జరుగుతోంది. అది కూడా ఎక్కడో కాదు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లాలోనే. మంత్రి ఎవరో కాదు అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి. అసలు ఆధిపత్య పోరు ఎందుకు జరుగుతోంది.
 
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీకి కష్టపడి పనిచేసినా తమను పట్టించుకోవడం లేదని కొందరు, పదవుల్లో ఉన్నా తమకు ప్రాధాన్య లేదని ఇంకొందరు నిరుత్సాహంతో ఉంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళయినా ఈ పరిస్థితి రోజు రోజుకు అధికమవుతోంది తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. 
 
తాజాగా ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి సభలకు కొందరు డుమ్మాకొట్టగా మరికొందరు సొంతంగా సభలు నిర్వహించుకోవడం...మరికొందరు మొక్కుబడిగా సభల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అధికార తెలుగుదేశంపార్టీకి పట్టుకొమ్మగా ఉంటున్న శ్రీకాళహస్తి పట్టణంలో రెండు గ్రూపులు, ఆరువర్గాలుగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. మున్సిపాలిటీలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. 
 
ఇటీవల పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 33వ వార్డులో  కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతల మధ్య వివాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే అభివృద్థి పనుల్లోనూ ప్రాధా్యం లేదంటూ ఓ మున్సిపల్‌ కీలక నేతకు పార్టీకి అంటీముట్టనట్లు దూరంగా ఉంటూ వస్తున్నారు.
 
పార్టీ స్థానిక నేతలు సైతం ఈ విషయమై పట్టించుకోవడం లేదనేది సదరు నేత వాదన. ఒకానొక దశలో మంత్రిపైన కూడా సదురు నేత తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తాజాఆ జరిగిన జన్మభూమి సభల్లో అంటీముట్టనట్లు పాల్గొన్నారనేది ప్రచారం. ఇక శ్రీకాళహస్తి మండలంలో అయితే పార్టీలో విభేధాలు మరింతగా ఉంటున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి కష్టపడి పనిచేసినా తమను పట్టించుకోవడం లేదని దాదాపు 10మంది సర్పంచ్‌లు సైతం తీవ్ర నిరుత్సాహంతో ఉంటున్నట్లు సమాచారం.
 
ఆయా సర్పంచ్‌లు ఇప్పటికీ పార్టీ ముఖ్యనేతలను సైతం కలవడం లేదనేది సమాచారం. మరోవైపు శ్రీకాళహస్తి మండలంలో కీలక పదవులు చేపట్టిన కొందరు నేతలు సైతం పార్టీకి అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం దృష్టిపెట్టడం లేదనేది వారి వాదన. ప్రస్తుతం మంత్రి ఇలాకాలోనే ఇలాంటివి జరుగుతుండడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మద్యం సేవంచే రాజకీయ నేతలను ఉరితీయాలి : సెనేటర్ షాహీ సయ్యద్

పాకిస్థాన్ దేశంలోని అవామీ నేషనల్ పార్టీకి చెందిన షాహీ సయ్యద్ అనే సెనేటర్ ఓ సంచలన ప్రకటన ...

news

బెంగుళూరులో 'నిర్భయ' ఘటన.. 'లవ్‌ లెటర్‌ ఇస్తే చిల్లర ఇస్తా'నన్న కండక్టర్... డ్రైవర్ వత్తాసు

దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో మరో నిర్భయను తలపించే భయానక చర్య ఒకటి జరిగింది. డిసెంబర్ 31వ ...

news

మహిళలకు కథలు చెప్పి లోబరుచుకుని అత్యాచారం... కర్చీఫ్‌తో గొంతు బింగించి హత్య... తూగోలో కిరాతక చర్య

తూర్పుగోదావరి జిల్లాలో ఓ కిరాతకుడు చేసిన చేసిన దుశ్చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ...

news

ముందు ఇష్టపూర్వకంగా సెక్స్.. ఆ తర్వాత డబ్బుకోసం... గ్యాంగ్ రేప్ డ్రామా...

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఓ యువతి ఆడిన గ్యాంగ్ రేప్ డ్రామా తాజాగా వెలుగులోకి ...

Widgets Magazine