గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : ఆదివారం, 12 మార్చి 2017 (11:29 IST)

శ్రీకాళహస్తిలో రగులుతున్న రాజకీయం - తలపట్టుకుంటున్న మంత్రి

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో అధికార పార్టీలో అసంతృప్తులు, అలకలు, పార్టీ నాయకత్వంపై నమ్మకలేమి రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో అధికార పార్టీలో అసంతృప్తులు, అలకలు, పార్టీ నాయకత్వంపై నమ్మకలేమి రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి కీలకమైన మున్సిపల్ ఛైర్మన్ వారం రోజుల క్రితం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఓక మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజవర్గం నుంచే తాను ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మెల్యే టిక్కెట్ ఆడుతానని చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 
 
అది మరువకముందే శ్రీకాళహస్తి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మండలంలో కీలక నేత, రాచగన్నేరి సర్పంచ్ అయిన బొల్లినేని జగన్నాథంనాయుడు త్వరలోనే ఆ పార్టీకి వీడ్కోలు పలికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బొల్లినేనే కాదు పలువురు సర్పంచ్‌లు సైతం పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి మండల ప్రధాన కార్యదర్సి రాచగన్నేరి సర్పంచ్ బొల్లినేని జగన్నాథం నాయుడు త్వరలోనే ఆ పార్టీని వదిలి వైకాపాలో చేరునున్నారట. బలమైన సామానిజక వర్గం కలిగిన బొల్లినేని శ్రీకాళహస్తి మండలంలోని కీలక నేతల్లో ఒకరుగా ఉంటున్నారు. తితిదే ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా స్వతంత్రంగా ఖర్చు పెట్టి కార్యక్రమాల్లో పాల్గొనే నేతగా బొల్లినేనికి పేరుందట. 
 
పార్టీలో ఎంత పనిచేసినా సరైన గుర్తింపు లేకపోవడంతోనే ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి బొల్లినేనిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే తన వారిని పంపించి ఆయన్ను పార్టీలోనే ఉండేటట్లు ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే చాలామంది నేతల్లో అధికార పార్టీ నేత నుంచి ప్రతిపక్ష పార్టీకి వెళ్ళిపోతున్నారని అధినేత చంద్రబాబుకు తెలిసిపోయిందట. 
 
దీంతో బొల్లినేనిని ఎలాగైనా టిడిపిలోనే ఉండేటట్లు చేయాలన్నదే మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆలోచన. అందుకే తన శాయశక్తులా ప్రయత్నం మాత్రం చేస్తున్నారట. ఇప్పటికే తన మంత్రిపదవిపై గుర్రుగా ఉన్న అధినేత, కనీసం తన నియోజకవర్గంలో పార్టీ నేతలను కూడా కాపాడుకోలేకపోతున్నారంటే మళ్ళీ మైనస్ మార్కులు వస్తాయన్న భయంతో మంత్రి బొజ్జల ఉన్నారట.