గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PY REDDY
Last Modified: బుధవారం, 24 డిశెంబరు 2014 (08:14 IST)

సూపర్ సూర్యుడు.. క్లిక్ మనిపించిన నాసా

సాధారణంగా సూర్యుడిని చూడాలంటే కళ్ళు మబ్బులు కడతాయి. నీలిరంగల్లో అందమైన కిరణాలను ఉద్గారం చేసే సూర్యుడిని ఎప్పుడైనా చూశారా.. అదెలా సాధ్యం అసలు సూర్యుడిని చూడడమే కష్టమైనప్పుడు అందులోంచి రంగులు కూడా చూడగలమా.. అదే మరీ.. ఆ సంగతి నాసా సంస్థను అడగండి అదెంత పని సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో చూడండంటూ ఓ ఫోటోను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవిగోండి. 
 
నీలి రంగులు ఉద్గారం చేస్తున్న సూర్యుడు
సూర్యుడి ఉపరితలం నుంచి అతి శక్తిమంతమైన ఎక్స్ కిరణాలు వెలువడుతున్నప్పుడు ఇటీవల అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ‘నూస్టార్’ టెలిస్కోపు  ఈ ఫొటోను క్లిక్‌మనిపించింది. అందులోంచి నీలి రంగు కిరణాలను ఉద్గారం చేసే దృశ్యాన్ని టెలిస్కోపు ఒడిసిపట్టుకుంది. వాస్తవానికి సుదూర  ప్రాంతాల్లోని నక్షత్రాలు, కృష్ణబిలాలను అధ్యయనం చేసేందుకు నూస్టార్(న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే)ను నాసా 2012లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.
 
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తొలిసారిగా ఇలా సూర్యుడి వైపు తిప్పారు. ఇంకేం.. ఇంతకుముందెన్నడూ వీలుకానంత స్పష్టమైన ఫొటోలో సూర్యుడు చిక్కాడు. ఈ టెలిస్కోపుతో అధ్యయనం వల్ల సూర్యుడి ఉపరితలం, సౌరజ్వాలలు, రేడియేషన్, ప్లాస్మాకణాల గురించి కొత్త సంగతులు తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారికి బెస్టాఫ్ లక్ చెబుదాం..