Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పన్నీర్ 'త్యాగయ్య' (సెల్వం)కు వారం రోజుల్లో మళ్లీ సీఎం కుర్చీ వరించేనా? శశికళ అత్యాశపై సుప్రీంకోర్టు నీళ్లు

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (13:09 IST)

Widgets Magazine
opanneerselvam

తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు సోమవారం ఆమోదించారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని పన్నీర్‌ను కోరారు. దీంతో పన్నీర్ సెల్వం మరికొద్దిరోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. 
 
ఇదిలావుండగా, ఓ.పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని తృణప్రాయంగా వదులుకోవడం ఇది మూడోసారి. జయలలితకు నమ్మినబంటుగా, పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడిగా పన్నీర్ సెల్వం ముద్రపడిపోయారు. ఫలితంగా ఆయనకు ముఖ్యమంత్రి పీఠం వరించింది. అక్రమాస్తుల కేసులో జయలలిత దోషిగా తేలినపుడు, జైలుకెళ్లినపుడల్లా ఆమె వారసుడిగా, ముఖ్యమంత్రి పీఠానికి కాపలా ఉంటూ వచ్చారు.
 
అయితే, జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ పగ్గాలను ఆమె ప్రియనెచ్చెలి శశికళ చేపట్టారు. ఆ తర్వాత రెండు నెలల పాటు మౌనంగా ఉన్న శశికళ ఇపుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం మరోమారు తన విశ్వాసాన్ని చాటుకుంటూ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన పేరు పన్నీర్ కాదనీ.. త్యాగయ్య అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుండగా, పన్నీర్ రాజీనామాతో ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేందుకు శశికళ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి కోరిక మూన్నాళ్ల ముచ్చటేనా? అనే చర్చ జరుగుతోంది. వారం రోజుల్లో సీఎం పీఠంపై మళ్లీ పన్నీర్ సెల్వం కూర్చుంటారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో మరో వారం రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్నారు. గతంలో ఈ కేసులో జయలలిత, శశికళను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. అయితే, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి, ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాలుగైదు రోజుల్లోనే సుప్రీం తీర్పు వెలువడనుంది. 
 
ఒకవేళ, ఈ కేసులో శశికళ దోషిగా తేలితే సీఎం పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి వస్తుంది. దీంతో, ఆమె సీఎం కోరిక మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఆ తర్వాత పన్నీర్ సెల్వమే మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జయకు అత్యంత విధేయుడు అయిన పన్నీర్ కాకుండా మరెవరు సీఎం అయినా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో, తమిళనాడు రాజకీయాలు రానున్న వారం రోజుల పాటు అత్యంత ఉత్యంఠభరితంగా కొనసాగనున్నాయనడంలో సందేహం లేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకు తేరుకోలేని షాకిచ్చిన సుప్రీంకోర్టు... ఆ కేసులో వారం రోజుల్లో తుదితీర్పు

తమిళనాడు ముఖ్యమంతిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించి.. తాను సీఎం కుర్చీలో ...

news

తెలివైన జయమ్మకు ఓటేశాం.. నిశాని శశికళకు కాదు.. నెటిజన్ల కామెంట్స్

తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై నెటిజన్లు తమదైనశైలిలో ...

news

అపుడు అత్యాచారం చేశాడు.. ఇపుడు తాళి కట్టాడు...

అపుడు అత్యాచారం చేసిన నిందితుడే ఇపుడు జైల్లో తాళి కట్టాడు. ఈ వింత ఘటన ఒడిషా రాష్ట్రంలోని ...

news

ముస్లిం తీవ్రవాదుల వల్ల జరగరానిది జరిగితే ఆ న్యాయమూర్తిని బాధ్యుడిని చేయాలి : ట్రంప్ నిప్పులు

అమెరికా పౌరుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ...

Widgets Magazine