Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడులో బిజెపి గేమ్... ఎందుకు...?

గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:09 IST)

Widgets Magazine
bjp flag

తమిళనాడు వ్యవహారంలో తాము తలదూర్చలేదని కేంద్రమంత్రులు పదే పదే చెబుతున్నారు. కానీ కేంద్రం తమిళనాడును తమ ఆధీనంలోకి తీసుకుని జెండాను ఎగురవేయాలన్న ఆలోచనలో ఉందనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. తమ కనుసన్నల్లోనే తమిళనాడు ప్రభుత్వం నడవాలన్నది వారి ఆలోచన. మొదట్లో పన్నీరు సెల్వంను వాడుకున్న బిజెపి నేతలు ప్రస్తుతం కూడా ఆయనతోనే తాము అనుకున్నది సాధించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలవైపు విజయకేతనం ఎగురవేసి పాలన సాగిస్తున్న బిజెపి ప్రస్తుతం దక్షిణాధి రాష్ట్రాలవైపు మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో పాతుకుపోయిన పార్టీలు ఉంటే వాటిని పక్కకు పంపించో, లేకుంటే ఆ పార్టీలోని నేతలు తమవైపు తిప్పుకుని తమ కన్నుసన్నల్లోనే పాలన సాగాలన్న ఉద్దేశంలో ఉంది బిజెపి.
 
అందుకే తమిళనాడు రాష్ట్రాన్ని ఏ మాత్రం వదలడం లేదనే వాదనలు వినబడుతున్నాయి. పన్నీరు సెల్వంకు మొదట్లో గట్టిగా మద్దతిచ్చి ముందుకు తోసినా శశికళ ముందు అది ఏ మాత్రం పనిచెయ్యలేదు. ఇక చెయ్యి జారిపోయిందిలే అనుకున్న సమయంలో మళ్ళీ మరో అవకాశం వచ్చింది. శశికళ జైలుకు వెళ్ళడం, ఆమె నియమించిన అల్లుడు దినకరన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం, పార్టీకి వీరిద్దరు దూరమైపోవడంతో మళ్ళీ బిజెపి రంగంలోకి దిగింది. పన్నీరు సెల్వంను రంగంలోకి దింపి మళ్ళీ సిఎం అవ్వాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పన్నీరు, పళణిస్వామిలకు మధ్య కీలక సమావేశాలకు జరుగుతున్నాయి. 
 
ఎట్టిపరిస్థితుల్లోను సిఎంగా పన్నీరు సెల్వం కావాలనే దిశగా బిజెపి ప్రయత్నం చేస్తోంది. స్వయంగా కేంద్రంలోని కొంతమంది మంత్రులే పళణిస్వామిలోని ఎమ్మెల్యేలు, ఎంపిలతో చర్చిస్తున్నారంటే బిజెపి ఏ విధంగా గేమ్ ఆడుతుందో అర్థమైపోతుందని అంటున్నారు. మొత్తంమీద బిజెపి అనుకున్నది సాధించే తీరుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భానుడి ప్రతాపం: వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో 48 మంది మృతి.. మధ్యాహ్నం వేళల్లో ఎమెర్జెన్సీ

భానుడి ప్రతాపంతో తెలుగు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే భానుడి ప్రతాపానికి ...

news

చంద్రబాబు దొంగనా? పోలవరం నిధుల ఖర్చుపై మరో కమిటీ.. స్వయంగా నిఘా పెట్టిన మోడీ

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మడం లేదా? ...

news

మగాడితో లేచిపోతూ ప్రేయసి చెప్పిన కారణంతో దొంగగా మారిన 65 యేళ్ల వృద్ధుడు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో లేచిపోతూ ...

news

తమిళనాట అధికార మార్పిడి.. ఓపీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి.. పళనికి కేంద్ర పదవి? బీజేపీ పక్కా ప్లాన్

దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి అనంతరం ఆ పార్టీలో ముసలం ...

Widgets Magazine