Widgets Magazine

శశి'కల' కల్లలైన వేళ... శశి 'సింహం'ను బోనులో పెట్టిన కేసు ఇదీ...

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (14:30 IST)

Widgets Magazine
sasikala

దొంగ అనేవాడు పట్టుబడినా నేరం రుజువయ్యే వరకూ తను దొరేనంటూ బుకాయిస్తాడు. పైగా పెచ్చుమీరిపోయి మాట్లాడుతాడు కూడా. జయలలిత నెచ్చెలి శశికళ విషయంలో ఇదే జరిగింది. నిన్న సాయంత్రం వరకూ తను సింహం అనీ, తనవద్ద వున్న ఎమ్మెల్యేలంతా సింహం పిల్లలనీ చెప్పుకున్నారు. ఐతే తెల్లారేసరికి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో నాలుగేళ్ల జైలు శిక్షతో జైలు బోనులోకి వెళ్లనున్నారు. ఇంతకీ ఆ కేసు వివరాలు ఏంటని చూస్తే... తమిళనాడు ముఖ్యమంత్రిగా 1991-96 మధ్య కాలంలో జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టారంటూ కేసు దాఖలైంది. 
 
ఆ కేసు విచారణం చేసిన కర్నాటక హైకోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనితో కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 1996లో అన్నాడీఎంకే ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఆ తర్వాత భాజపా నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరశి, సుధాకరన్ అక్రమాస్తులు వెనకేశారంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. హైదరాబాదులో ద్రాక్ష తోట, ఫామ్ హౌస్, నీలగిరి కొండల్లో టీ ఎస్టేట్, ఆభరణాలు, బంగళాలు... ఇలా మొత్తం రూ. 66 కోట్లు విలువ చేసే ఆస్తులు అక్రమంగా ఆర్జించారంటూ పిటీషన్లో పేర్కొన్నారు. 
 
ఈ క్రమంలో జయ ఇంట్లో 1997వ సంవత్సరంలో సోదాలు చేపట్టిన పోలీసులు పెద్ద ఎత్తున వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా 2001లో జయలలిత తిరుగులేని ఆధిక్యంతో మళ్లీ గద్దెనెక్కారు. దీనితో కేసు విచారణను తమిళనాడులో కాకుండా కర్నాటకకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అక్కడ విచారణ చేపట్టిన కర్నాటక ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా నిర్ణయించి, ఆమెతో పాటు ముగ్గురికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. జయలలిత కర్నాటక హైకోర్టులో అప్పీల్ చేశారు. 
 
సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకున్నారు. దానితో సుప్రీంకోర్టు జయలలిత, శశికళతో పాటు మరో ఇద్దరికీ 2014 అక్టోబరు 17న బెయిల్ మంజూరు చేసింది. 2015 మే 11న కర్నాటక హైకోర్టు జయలలితపై వున్న అభియోగాలను రద్దు చేస్తూ కేసును కొట్టేసింది. ఈ నేపధ్యంలో కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు కేసుపై విచారణ చేస్తుండగానే జయలలిత 2016 డిసెంబరు 5న కన్నుమూశారు. ఆ తర్వాత శశికళ వేగంగా పావులు కదిపారు. పార్టీ పగ్గాలను చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాలని ఆశపడ్డారు. తక్షణమే తను ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరారు. ఐతే సుప్రీంకోర్టు తీర్పుతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. కారాగారం ఆమెకు నివాసంగా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీరును పార్టీ నుంచి వెలివేశారట.. సీఎం అభ్యర్థిగా పళనిసామి.. గవర్నర్ ముందు రెండే ఆప్షన్లు

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సీఎం పదవి చేపట్టేందుకు ఛాన్స్ లేదని అన్నాడీఎంకే ...

news

శశికళను అమ్మ ఆత్మ పట్టుకుందా? సీఎం అన్నందుకు కసి తీర్చుకుందా?

తమిళనాడులో గత నెల రోజులుగా శశికళ పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మోగుతూనే వుంది. దివంగత ...

news

కూవత్తురుకు పోతున్నా.. ఎమ్మెల్యేల వద్దకు పన్నీర్ సెల్వం.. శశికళను జైలుకు పంపి..?

అన్నాడీఎంకే పార్టీలో అమ్మ మరణానికి తర్వాత చీలికలు ఏర్పడ్డాయి. అక్రమాస్తుల కేసులో సుప్రీం ...

news

ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వం ఔట్.. సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి

తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం ...