శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Modified: బుధవారం, 22 ఏప్రియల్ 2015 (16:22 IST)

ప్రత్యేక హోదా వస్తుందా..! లేదా..? టిడిపి, బీజేపీ.. దోబూచులాట

ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరిలో మేదులుతున్న అంశం నుతన రాఙధానికి కేంద్రం ఎంత నిధులు ఇస్తుంది.? పొలవరం ఎప్పటికి పూర్తి చేస్తారు?  ప్రత్యేక ప్రతిపత్తి వస్తుందా? ఈ అంశాల చుట్టూ ప్రజలు అసక్తిగా ఎదురు చుస్తూన్నారు. వారి అకాంక్షలు ఇలా ఉంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు అసుసరిస్తున్న తీరు అందుకు భిన్నంగా ఉంది. ఈ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలు తమకు సంబంధం లేనివిగా భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ఓ రాజకీయ ఆట అడుకుంటున్నారు 
 
బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని పరిశీస్తే,  ప్రత్యేక ప్రతిపత్తి అన్నది సాధ్యం కాని పని అన్నట్లు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. హమీల అమలులో ఇబ్బంది కలగడానికి విభజన చట్టం సరిగా లేకపోవడమేనట. మరి పోలవరం నిధులు, ఆర్థిక లోటు భర్తీ, విద్యాసంస్థలు ప్రారంభం కాకపోవడానికి ఏ చట్టం అడ్డు వచ్చింది.? వాటికే ప్రత్యేక చట్టాలు లేవుగా వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇక్కడ కేంద్రం నిజాయితీగా ఒక విషయం అలోచించాలి. ఏపి ప్రభుత్వం తీవ్రమైన లోటుతో నడుస్తోంది. కేంద్రమే చట్టంలో పేర్కోన్నది, తాను చేయగలిగింది ఏ రూపంలో చేస్తారు? ఏ సమయంలో, ఎన్ని దఫాలుగా చేస్తారన్నవిషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని పరిశీలకులు భావిస్తున్నారు.  
 
ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం తనకున్న పరిమిత వనరులతో తన ప్రాధాన్యతలను ఎంచుకుంటుంది. పైకి సియం ఎన్ని చెబుతున్నా పోలవరాన్ని  కేంద్రం నిర్మిస్తుందో? లెదో? అన్న అనుమానంతోనె పట్టిసీమను ఎంచుకున్నారనేది వాస్తవం. కేంద్రం మాత్రం రాజకీయంగా లాభం ఎంత ? అన్న లెక్కలేసుకుంటోందా అన్న అనుమానం కలుగుతుంది. అదే సందర్భంలో తేదేపా కూడా రాజకీయాలు చేయడంలో తాను తక్కువేం కాదు అన్నచందంగా వ్యవహరిస్తుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కేంద్రం నుంచి నిధులు వస్తే అది తన ఘనత అన్నట్లు, నిధులు రాకపోతే అది నరేంద్ర మోడీ వైఫల్యం అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.  ఏపి విభజన చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించరాదని చెబుతున్న రాష్ట్రం తనకు కూడా అదే వర్తిస్తుందనే విషయాన్ని గుర్తించాలి. చట్ట ప్రకారం రాజధాని ఎంపిక శివరామక్రిష్ణన్ కమిటీ నివేదిక కేంద్రానికి ఇవ్వాలి. దానిని పరిశీలించిన తర్వాత కేంద్రం రాష్టానికి తగు సలహాలిస్తుంది. ఆ తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకోవాలి.
 
యోగా క్లాసుల్లో మాట్లాడుతున్న చంద్రబాబు
కానీ 29 ఆగస్టు 2014 కేంద్రానికి కమిటీ రిపోర్ట్ ఇస్తే కనీసం కేంద్రం నుంచి ఎటువంటి సలహా రాకుండానే చంద్రబాబు 4 రోజుల తర్వాత ఏకపక్షంగా రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు రాజధాని స్వరూప, స్వభావాలను చైనా,జపాన్,సింగపూర్ తో చర్చిస్తారు. రాజధాని నిర్మాణానికి  నిధులు ఇవ్వాల్సిన కేంద్రంతో మాట మాత్రమైనా చర్చించరు. కేవలం డబ్బులు మాత్రం అడుగుతారు. మాటల్లో వెనుకబడి ఉన్నాం.. ప్రత్యేక ప్రతిపత్తి కావాలి అంటారు.   
 
కానీ అధికారికంగా ప్రవేశపెట్టే బడ్జెట్లో  2సంవత్సరాలలో 2అంకెల అభివృద్ధి సాధిస్తామని అంటారు. అంత అవకాశం ఉంటే ప్రత్యేక హొదా ఎందుకు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. అలాంటప్పుడు ఎలా ప్రత్యేక హోదా వస్తుంది. ఇక్కడ ఎవరి రాజకీయా స్వార్థ ఆలోచన వారికి కనిపిస్తుంది. ఇప్పటికైనా అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశంపార్టీలు నిధుల విషయంలో దాపరికం లేకుండా వ్యవహరించాలి. రాజకీయ లాభాపేక్షతో వ్యవహరిస్తే ఎన్నో ఆశలతో గెలిపించిన ప్రజల ఆగ్రహనికి ఈ పార్టీలు గురి కావలసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.