గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (16:42 IST)

తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుంటుందా...?

తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుంటుందా...! ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబయిలో చంద్రబాబు ఏం చేస్తున్నారు.? ఎన్డీయేపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఊతం లభిస్తోంది. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే చెప్పాల్సి ఉంటుంది. వివరాలిలా ఉన్నాయి. 
 
మొదట్లో కేంద్రం నుంచి నిధులు రాబడతాం.. మోడీని ఒప్పించి నిధులు తీసుకు వస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు తమ మాట మారస్తూ వచ్చారు. వస్తున్నారు. నచ్చజెపుతాం. అనే స్థాయి నుంచి మెల్లగా డిమాండ్ చేసే స్థాయికి వచ్చేశారు. రైల్వే బడ్జెట్ నుంచి మరింత వేగం పెంచారు. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం జరిగిందనే చెప్పారు. ఆపై బడ్జెట్ సందర్భంగా తీవ్ర అభ్యంతరమే వ్యక్తం చేశారు. నిధులు ఇవ్వకపోతే ఎలా అనే స్థాయికి వచ్చారు.
 
ప్రస్తుతం చంద్రబాబు ఎన్గీయే సంకీర్ణ పార్టీల మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు శివసేన, శిరోమణి అకాలిదళ్ మద్దతు కోరుతున్నారు. బడ్జెట్ లో సవరణలు చేసి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుతున్నారు. సకీర్ణ పార్టీలతో కలిపి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాజ్ పేయి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను తీసుకురావడానికి మిగిలిన పార్టీలను కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీతో తెగతెంపు చేసుకున్నా ఇబ్బంది లేదనే స్థితికి వచ్చే అవకాశం ఉంది. 
 
ఇదిలా ఉండగా, రాష్ట్రానిని న్యాయం చేయకపోతే కేంద్ర క్యాబినెట్ లోంచి బయటకు వచ్చేందుకు కూడా తాము సిద్ధంగా వెనుకాడబోమని రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. రూ. 18000 కోట్ల రూపాయాల ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించడం దారుణమని అన్నారు. కేంద్రం తమాషా చేస్తుందని ఆయన విమర్శించారు. ఇలా రూ.100తో పనులు జరిగితే అది పూర్తి కావడానికి కనీసం 400 యేళ్ళు పడుతుందని అన్నారు .ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగకపోతే కేంద్ర కేబినెట్ లోంచి బయటకు రావడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. పరిణామాలు వేగంగా కదులుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకునే పరిస్థితి ఎంతో దూరంలో లేదని అనిపిస్తుంది.