గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (11:31 IST)

జనసేనలోకి గాలి ముద్దుకృష్ణమనాయుడు...? సలహా ఇచ్చిన అనుచరులు

ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై టిడిపి సీనియర్ నేతల్లో ఆగ్రహావేశాలను వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. ఎన్నో యేళ్ళుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంపై త

ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై టిడిపి సీనియర్ నేతల్లో ఆగ్రహావేశాలను వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. ఎన్నో యేళ్ళుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సీనియర్లు. చంద్రబాబు వైఖరిని ప్రశ్నించకుండానే పార్టీని వదిలివెళ్ళి పోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు మొదటగా ఉన్నారు. ఇప్పటికే తిరుగుబావుటా ఎగురవేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి బాటలో చాలామంది నేతలు నడుస్తున్నారు.
 
ఎన్టీఆర్ హయాం నుంచి కష్టపడి పనిచేసి మంత్రిగా అనుభవం ఉన్న గాలిముద్దుకృష్ణమ నాయుడు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అది కూడా వైకాపా నేత, సినీనటి రోజా చేతిలో. ఏ మాత్రం ఈ విషయాన్ని ముద్దుకృష్ణమ నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే పార్టీలో సీనియర్ కనుక బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ తర్వాత ఇక మంత్రనే ఆయన అనుచరలు భావించారు. 
 
నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు నుంచి గాలిముద్దుకృష్ణమ నాయుడుకు మంత్రి పదవులు ఖాయమని అందరూ భావించారు. బొజ్జలను తొలగించినా అటవీశాఖామంత్రిగా ముద్దుకృష్ణమ నాయుడుకే బాబు ఇస్తారని అనుకున్నారు. అయితే అంతా రివర్సయ్యింది. ఏ సంబంధం లేకుండా వైకాపా నుంచి పార్టీలోకి వచ్చిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి లభించింది.
 
ఈ విషయాన్నే పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అమర్నాథ్ రెడ్డికి ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చారన్నది సీనియర్ల ప్రశ్న. ఎంత చెప్పినా బాబులో మార్పు రాదన్న ఉద్దేశంతో ఇక ముద్దుకృష్ణమ నాయుడు పార్టీకి రాం రాం చెప్పేందుకు సిద్ధమై పోయారు. జగన్ అంటే అస్సలు పడని ముద్దుకృష్ణమ నాయుడు ఇక పవన్ కళ్యాణ్‌ పార్టీ ఒక్కటే దిక్కని ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారట. తన అనుచరులతో ఇదే విషయాన్ని చెబితే ప్రస్తుతం పార్టీ మారడమే ఉత్తమమని అనుచరులు కూడా సలహా ఇచ్చారట.