Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీఎం కేసీఆర్ జీతం చూస్తే కళ్ళు తిరగాల్సిందే.. జయలలిత ఒక్కరూపాయి తీసుకునేవారు!

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:22 IST)

Widgets Magazine
kcr - babu

దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ సీఎం కేసీఆర్ జీతమే టాప్. ఇంతకీ ఆయన జీతం ఎంతో తెలుసా అక్షరాల నెలకు రూ.4,21,000. అయితే ఆర్థికంగా ఉన్నత రాష్ట్రం కావడంతో ఆ మాత్రం తీసుకుంటే తప్పేంటని తెరాస నేతలు సమర్థించుకుంటున్నారు. 
 
అంతేకాకుండా ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలకు కూడా తక్కువేం చేయలేదు. వారికి కూడా నెలకు రూ.2,50,000 జీతం ఇస్తున్నారు. ఇలా ఇస్తూ దేశంలోని అందరి ఎమ్మెల్యేల కంటే టాప్‌లో వారిని నిలబెట్టారు. ఇక రెండు రాష్ట్రాల విభజనతో ఖజానా ఖాళీ అయ్యిందని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తక్కువేమీ తీసుకోవట్లేదు. దేశంలో అధిక మొత్తంలో వేతనాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన మూడో స్థానంలో ఉండటం గమనార్హం. 
 
మొదటి స్థానం కేసీఆర్ ఆక్రమించగా, రెండో స్థానం ఉత్తరాఖండ్ సీఎం నెలకు రూ.2,50,000 చొప్పున జీతం తీసుకుంటున్నారు. మూడో స్థానంలో చంద్రబాబు రూ.2,40,000 తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏపీ ఎమ్మెల్యేలు కూడా నెలకు రూ.1,25,000 పుచ్చుకుంటున్నారు. ఇకపోతే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మరణించిన జయలలిత ఒక్కరూపాయి తీసుకుంటుండగా, పశ్చిమ బెంగాల్ దీదీ  అసలు అది కూడా పుచ్చుకోవట్లేదట. ఈ రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా జీతాలు తక్కువగా తీసుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు.
 
ఇక ఇప్పుడు పలు రాష్ట్రాల సీఎంలు ఎమ్మెల్యేల నెల జీతాలు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి 4,21,000, ఎమ్మెల్యేలు రూ.2,50,000
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రూ.2,50,000, ఎమ్మెల్యేలు రూ.1,25,000.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూ.2,40,000, ఎమ్మెల్యేలు రూ.1,25,000.
మధ్యప్రదేశ్‌  ముఖ్యమంత్రి రూ.2,00,000, ఎమ్మెల్యేలు రూ.1,10,000.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రూ.2,50,000, ఎమ్మెల్యేలు రూ.1,60,000
మహారాష్ట్ర ముఖ్యమంత్రి రూ.2,25,000, మంత్రులు రూ.2,05,000.
మంత్రులు రూ.2,05,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.1,70,000.
ఢిల్లీ ముఖ్యమంత్రి రూ.1,20,000 మంత్రులు రూ.1,20,000
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.88,000.
మంత్రుల వేతనాలు రూ.3,20,000.
ఎమ్మెల్యేల వేతనాలు రూ.2,10,000లకు పెంచాలని ఢిల్లీ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది.
 
తమిళనాడు ముఖ్యమంత్రి (జయలలిత) రూ.1, ఎమ్మెల్యేలు రూ.55,000.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి రూ.0. ఎమ్మెల్యేలు రూ.42,000.
 
మొత్తానికి అత్యధిక జీతం తీసుకుంటున్న జాబితాలో సీఎం కేసిఆర్ రికార్డు కెక్కితే బెంగాల్ దీదీ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సీఎంగా పనిచేస్తూ తన జీతాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ...

news

తిరుపతికి మొండిచేయి చూపించిన విత్తమంత్రి అరుణ్ జైట్లీ

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల. ప్రతిరోజు 50 నుంచి 70వేల మందికిపైగా భక్తులు తిరుపతికి ...

news

శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం.. అమ్మ స్మారకమండపం శంకుస్థాపన జరిగేనా?

అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత ...

news

డోనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు అమెరికా ఆర్థికవ్యవస్థ మటాష్

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు ఆ దేశ ...

Widgets Magazine