Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేసీఆర్ వల్ల తెలంగాణాలో రూ.10 వేల కోట్ల నష్టం.. ఎందుకు..?

సోమవారం, 13 మార్చి 2017 (16:09 IST)

Widgets Magazine
k chandrasekhar rao

నోట్ల రద్దు సామాన్యులపై ఎంత భారం పడిందో... ప్రభుత్వాలపై కూడా అంతే భారం పడిందట. ఒకటి రెండు కాదు వేల కోట్ల రూపాయలు. మొదట్లో పెద్దగా పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం.. ప్రస్తుతం అంత డబ్బును నష్టపోయామా అని ముక్కున వేలేసుకుంటుందట... అసలు ఎంత నష్టపోయిందో.. ఏ విధంగా నష్టపోయిందో తెలుసుకుందామా...
 
తెలంగాణ ప్రభుత్వానికి నోట్ల రద్దు దెబ్బ గట్టిగానే తగులుతోంది. మొదట ఊహించినదానికన్నా మూడు రెట్లు అదికంగా రెవెన్యూ నష్టం జరిగినట్లు తాజాగా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణ వంటి శాఖల ద్వారా సుమారు 55 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆశించిన ప్రభుత్వానికి ఆశా భంగమే ఎదురవుతోంది. 45 వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని, దాంతో సుమారు పది వేల కోట్ల రూపాయల గ్యాప్ వస్తోందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల రద్దును సమర్థిస్తూ మూడువేల కోట్ల రూపాయల లోటు వరకు ఉండవచ్చని అన్నారు.
 
కానీ అది రూ.10 వేల కోట్లకు వెళుతుండడంతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను డిల్లీకి పంపించారు. జీఎస్టీ, ప్రభుత్వ స్కీములలో రావల్సిన బాకీలు సుమారు 16 వేల కోట్ల రూపాయలు సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కోరడానికి ఆయన వెళ్లారని అంటున్నారు. ప్రత్యేకించి వాణిజ్య పన్నుల శాఖలో ఇప్పటికి 11 వేల కోట్ల ఆదాయ లోటు ఉండగా, ఈ మూడు వారాలలో కొంత రావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో వెయ్యి కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భూమా నాగిరెడ్డికి అదంటే చాలా ఇష్టమట..! ఏంటది..?

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన ...

news

భూమా పార్థివదేహం పక్కనే నంద్యాల అసెంబ్లీ సీటు కేటాయింపుపై లోకేశ్ చర్చలు?

ఒకవైపు భూమా నాగిరెడ్డి పార్థివదేహం. మరోవైపు నంద్యాల అసెంబ్లీ టిక్కెట్‌ను ఎవరికి ...

news

నీకు ఆఫీసులో పనెందుకు? నాతో సహకరించు హీరోయిన్ చేస్తా... రమ్మన్న నిర్మాతను...

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఒకవైపు సుచీ లీక్స్ రూపంలో కుదుపులకు గురి చేస్తుంటే ఇటువపై మన ...

news

దీపా జయకుమార్‌ను బెదిరిస్తున్న గూండాలు.. ఓపీఎస్‌కు మరో ఎమ్మెల్యే మద్దతు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు రాజకీయాల్లో చేదు అనుభవాలు ...

Widgets Magazine