బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (13:20 IST)

జగన్ కోసమే ఆ పని.. సోనియమ్మా నీకిది తగునా... పవన్ షాక్‌తో తెదెపా లీడర్...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలుగా విడిపోయేందుకు కొత్త కారణం చెప్పారు.. మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. అప్పటి కాంగ్రెస్ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలుగా విడిపోయేందుకు కొత్త కారణం చెప్పారు.. మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. అప్పటి కాంగ్రెస్ నేత,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినందుకే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చేశారని టీజీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయేందుకు జగన్మోహన్ రెడ్డి తొందరపాటు చర్యే కారణమని టీజీ వెంకటేష్ తెలిపారు. 
 
జగన్ ముఖ్యమంత్రి పదవి కావాలని అనుకున్నారని.. అలా అనుకోకుండా, సోనియా గాంధీ చెప్పిన మాట వినివుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నారు. సీమాంధ్ర ప్రజల కష్టాలకు జగన్ వైఖరే కారణమని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొంగలేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అలంకరించి ఆ తరువాత కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొంగలేనని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఏది ఏమైనా.. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని సోనియా విడగొట్టారని టీజీ వెంకటేష్ ఒప్పుకున్నారని తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. టీజీ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలుగు రాష్ట్రాలుగా కాంగ్రెస్ ఎందుకు విభజించింది.. దానితో కాంగ్రెస్ పార్టీకి లాభమేంటి..? తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ ఇచ్చిందా..? అనే ప్రశ్నలకు టీజీ వ్యాఖ్యలే సమాధానంగా నిలిచాయి. 
 
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు ఏపీలో జీవం లేకపోవడంతో.. తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన టీజీ.. కాంగ్రెస్ పార్టీలో జగన్ ఉండివుంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదని.. తెలుగు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయేది కాదన్నారు. దీనిని బట్టి రాష్ట్రాన్ని విడగొట్టి.. ఏపీ ప్రజలకు భారీ నష్టాన్ని ఏర్పరిచారని ప్రజలకు బాగా అర్థమైపోయింది. 
 
రాష్ట్రవిభజన ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని.. తద్వారా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదనుకున్న కాంగ్రెస్‌కు దిమ్మతిరిగింది. కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీని, తెలంగాణగా వేర్వేరు రాష్ట్రాలుగా చేసి.. ఏపీకి రాజధాని లేకుండా, నిధులు లేకుండా, స్పెషల్ స్టేటస్‌ లేకుండా వదిలిపెట్టింది. దీంతో ఏపీకి పుట్టెడు కష్టాలు తప్పలేదు. ఐతే ఇప్పుడు టీజీ ఇలా మాట్లాడటం వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఎక్కుపెట్టిన ఒత్తిడి బాణమేనంటున్నారు.