Widgets Magazine Widgets Magazine

తిరుమలలో పుచ్చకాయలు నిషేధం...! ఎందుకో తెలుసా?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:15 IST)

Widgets Magazine
watermelon

తిరుమల పుణ్యక్షేత్రంలో మద్య, మాంసాలు, పొగాకులాంటి నిషేధిత పదార్థాల జాబితాలో తాజాగా పుచ్చాకాయలు కూడా చేరాయి. అదేంటి పుచ్చకాయలేమీ మత్తుపదార్థం కాదుగదా.. పైగా వేసవి ఉపశమనం కలిగించడంతోపాటూ ఆరోగ్యానికి మంచిదేకాదా.. మరివాటిపై నిషేధం ఎందుకనుకుంటున్నారా.. అసలు విషయానికొస్తే తిరుమలలో పుచ్చకాయల వల్ల చిరుతపులులు దాడులు భక్తులపై దాడులు చేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు... పుచ్చకాయలకు పులులకు లింకేంటని తికమకపడుతున్నారా? మీ డౌటు తీరాలంటే ఈ స్టోరీ చూడండి. 
 
వేసవి ఎఫెక్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమ నిప్పుల కొలిమిగా ఉంది. తిరుపతిలోనూ ఉష్ణోగ్రతలు రికార్డుస్ధాయిలో 45 డిగ్రీలకు దగ్గరగా నమోదవుతున్నాయి. దీంతో ఎండల ప్రభావానికి తిరుపతి వస్తున్న భక్తులకు తిప్పలు తప్పడంలేదు. కూల్ డ్రింక్‌లకన్నా ప్రకృతిపరంగా లభించే కొబ్బరిబోండాలు, పుచ్చకాయలంటేనే ఎక్కువ వైపే మొగ్గుచూపుతున్నారు జనాలు. 
 
అయితే తిరుమలలో పుచ్చాకాయలుపై నిషేధం అమలులో ఉండటంతో అశ్యర్యం వ్వక్తం చేస్తున్నారు భక్తులు. తిరుపతి అలిపిరి చెక్ పోస్టు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది భక్తులు తీసుకువెళ్తున్న పుచ్చకాయలను తిరుమలకు అనుమతించడంలేదు. కనీసం పుచ్చముక్కలను పట్టుకెళ్లనీయడంలేదు. తిరుమలలో అయితే ఎక్కడ వెతికినా పుచ్చకాయజాడే కనిపించదు. గతంలో తాము తిరుమల వచ్చినపుడు ఎక్కచూసిన పుచ్చకాయలు ఉండేవని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు భక్తులు. అదేమిటని అడగితే పుచ్చాకాయల వల్ల పులులు వస్తాయని సమాధానం చెప్తున్నారు టీటీడీ సిబ్బంది. దీంతో అవాక్కవడం భక్తులవంతవుతోంది.
 
గతంలో తిరుమలలో పుచ్చకాయల వల్ల తమ వ్యాపారం బాగా జరిగేదని ఎప్పుడై పుచ్చకాయలు నిషేధించారో అప్పటి నుంచీ వ్యాపారం కూడా సరిగా జరగడం లేదంటున్నారు పండ్ల వ్యాపారులు. అలిపిరి దగ్గర పండ్లను క్షుణ్ణంగా తనిఖీచేసి పుచ్చాకాయలు లేవని నిర్ధారించుకున్నతర్వాతే పైకి అనుమతిస్తున్నారంటున్నారు.
 
అయితే టీటీడీ అధికారులు చెప్పే పుచ్చాకాయలకు పులులకు మధ్య అవినాభావసంబంధ విషయానికోస్తే.. తిరుపతిలోనూ కాలిబాటలోనూ పుచ్చకాయలు కొన్న భక్తులు కాలినడక మార్గం ద్వారా తిరుమలకు వచ్చే సమయంలో దారిపొడవునా తొక్కలను వేస్తుంటారు. అయితే మిగతా పండ్లతోపోలిస్తే పుచ్చకాయలకు మందమైన తొక్కలుండటంతో వాటిని తినేందుకు అడవిలోని జింకలు వస్తుంటాయి. జింకలను వేటాడేందుకు చిరుత పులులు భక్తులుండే ప్రదేశాలకు వస్తాయంటున్నారు టీటీడీ సిబ్బంది. తిరుమలలోనూ తిని పాడేసిన పుచ్చతొక్కల వల్లే పులులు సంచారం పెరుతోందని అధికారులు వాదన. దీనికి తోడు తిరుమలలోని చెత్తంతా స్థానిక బాలాజీకాలనీ పక్కనే ఉన్న డస్ట్ డంప్ లోకివస్తుంటుంది. 
 
గతంలో తిరుమలలో చిరుతలు హడెలెత్తించిన సమయంలో ఎక్కువగా డస్ట్ బిన్ దగ్గరే పులులు కనిపించాయంటున్నారు. చెత్తలో ఉన్న ఆహారపదార్ధాలను తినేందకు వస్తున్న జింకలు, అడవిపందుల కోసం చిరుతలు మాటువేసి ఉంటున్నాయని తేల్చారు సిబ్బంది. ముఖ్యంగా పుచ్చకాయ తొక్కలు జింకలను ఎక్కువగా ఆకర్షిస్తాయనీ... తద్వారా దీని వల్ల పులల బెడదా తప్పదంటున్నారు. దీంతో అసలు పుచ్చకాయలపైనే నిషేధం విధిస్తే పులులు సంచారం తిరుమలలో భక్తులుండే ప్రదేశాల్లో తగ్గుతుందని నిర్ణయానికి వచ్చారు సిబ్బంది. దీంతో పుచ్చకాయలపైన నిషేధం విధించి దానిని పక్కాగా అమలు చేస్తున్నారు. 
 
పులి.. పుచ్చాకాయ అంశం పై అధికారులు వాదన ఇలా ఉంటే తిరుమలలో భక్తులు మాత్రం పుచ్చకాయలేనిలోటు కనిపిస్తోందంటున్నారు. మిగతా పండ్లుఎన్ని ఉన్నా అందుబాటు ధరలలో ఉంటే ఓ ప్లేట్ పుచ్చకాయ ముక్కలను తింటే ఎంతో ఉపశమనంగా ఉంటుందంటున్నారు భక్తులు. వ్యాపారస్తులు కూడా పుచ్చకాయల నిషేధంతో తమ వ్యాపారం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మొత్తం మీద పుచ్చాకాయలనిషేధంపై అధికారుల వాదనలో లాజిక్ ఉన్నప్పటికీ భక్తులు మాత్రం తిరుమలలో పులుల పుణ్యమా అని పుచ్చాకాయని మర్చిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుపతిలో డ్రగ్స్ మాఫియా - ఎస్వీయులో విద్యార్థుల చేతిలో హుక్కా...!

ఇప్పటివరకు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన డ్రగ్స్, హుక్కా సంస్కృతి ఇప్పుడు ద్వితీయశ్రేణి ...

news

ఏం సిద్ధా.. నువ్వు మరో బొజ్జలలాగా ఉన్నావే...!

తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో అటవీశాఖ అంటేనే భయపడిపోతున్నారు మంత్రులు. కారణం ఇప్పటికే ...

news

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు పట్టణాలకు చైనా పేర్లు.. దలైలామాకు వ్యతిరేకంగా?

1962 నాటి చైనా-భారత్ యుద్ధ సమయంలో అరుణాచల్ లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. ...

news

అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియాలకు చెక్.. 18 దేశాలకు వీసాలొద్దు.. రష్యా ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వ్యవహారంపై ప్రపంచ దేశాలు అసంతృప్తి వ్యక్తం ...