గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (14:13 IST)

చదలవాడ సుచరితకు తితిదే ఛైర్మన్ క్లాస్... ఎందుకు?

చదలవాడ సుచరితకు టిటిడి ఛైర్మన్ క్లాసేంటి అనుకుంటున్నారా.. అసలు ఈ సుచరిత ఎవరు.. టిటిడి ఛైర్మన్ క్లాస్ ఎందుకు ఇవ్వాలా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అయితే ఇది చదవండి.. తెలుస్తుంది...

చదలవాడ సుచరితకు టిటిడి ఛైర్మన్ క్లాసేంటి అనుకుంటున్నారా.. అసలు ఈ సుచరిత ఎవరు.. టిటిడి ఛైర్మన్ క్లాస్ ఎందుకు ఇవ్వాలా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అయితే ఇది చదవండి.. తెలుస్తుంది...
 
రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగనున్నాయి. రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కూడా. ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అయితే తామేమీ తగ్గలేదన్నట్లు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా ప్రచారంలో మునిగిపోయారు. ప్రధానంగా తిరుపతికి చెందిన తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సతీమణి చదలవాడ సుచరిత ఉపాధ్యాయుల తరపున స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 
 
గత కొన్నిరోజుల వరకు ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి తనకు అవకాశం లభిస్తుందని, ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిగా నిలబడతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన భర్త చదలవాడ కృష్ణమూర్తి నుంచి తనకు అన్ని విధాలుగా సపోర్టు ఉంటుందని భావించారు కూడా. అయితే భర్త నుంచి ఎలాంటి సపోర్టు లేకపోవడంతో ఆమెకు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో చివరకు స్వతంత్ర్య అభ్యర్థిగానే నిలబడ్డారు. అంతటితో ఆగలేదు. ప్రచారం జోరుగా చేశారు. గత రెండురోజుల వరకు ఉత్సాహంగా ప్రచారంగా నిర్వహించిన సుచరిత నిన్న సాయంత్రానికి చల్లబడిపోయారు. తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని, తెలుగుదేశంపార్టీ అభ్యర్థికే తాను మద్థతు ఇస్తున్నట్లు ప్రకటించారు. 
 
అసలు చదలవాడ సుచరిత ఒక్కసారిగా సైలెంట్ అవ్వడానికి కారణం ఉందంటున్నారు ఆమె సన్నిహితులు. మంగళవారం ఉదయం నుంచి చదలవాడ సుచరితకు ఆమె భర్త తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి క్లాస్ ఇచ్చారట. తెలుగుదేశం పార్టీలో ఉండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడం ఏంటి. పార్టీ నేతలు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇక ఆగిపో... చాలంటూ... దీంతో భర్త నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు సుచరిత ప్రకటించారు.