గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (12:11 IST)

ఏకఛత్రాధిపతిగా తితిదే పాలన.... నియంతలా మారిన ఈవో సాంబశివరావు

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల క్షేత్రంలో ఏ దిశగా పయనించినా ప్రపంచ వ్యాప్తంగా తెలుస్తోంది. తితిదే ఈఓ దొండపాటి సాంబశివరావు శ్రీవారి భక్తులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహోత్తరంగా ఫలించాయి. దీంతో ఈఓకి

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల క్షేత్రంలో ఏ దిశగా పయనించినా ప్రపంచ వ్యాప్తంగా తెలుస్తోంది. తితిదే ఈఓ దొండపాటి సాంబశివరావు శ్రీవారి భక్తులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహోత్తరంగా ఫలించాయి. దీంతో ఈఓకి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు అమాంతంగా పెరగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెచ్చేలా తితిదేలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఈఓ సాంబశివరావు తన తితిదే కుటుంబాన్ని మరిచారని మేధావులు అంటున్నారు. దేవుడిలా వ్యవహరిస్తూ ఏక ఛత్రాధిపత్యంతో అనుచరుల కనుసైగలతో తితిదే పాలనా వ్యవహారాలు నడిపిస్తూ సిబ్బందితో అసంతృప్తికి గురయ్యారని పలువురు ఆవేదన చెందుతున్నారు.
 
సిబ్బంది సాక్ష్యాధారాలతో ఆరోపించినా వారికి ఫలితం లేక ఆరోపించని వారికి కొరఢా వేస్తూ తితిదే కుటుంబంలో చెప్పుకోలేని కలహాలను దిగమించుకుని విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది అంటున్నారు. సర్వీసెస్‌లోనే కాకుండా ఉన్నత శాఖల్లో సిబ్బందికి ఎటువంటి ప్రయోజనాలు, పరిష్కారాలు జరగలేదని ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తితిదే ఆస్తులను భద్రత కరువైందని మేధావులు అంటున్నారు. ఎందుకంటే తితిదేలో సమస్యలపై ఉద్యోగ సంఘం నాయకులు కలిస్తే బదిలీలు చేస్తా ఏసీబీకి పట్టిస్తామంటూ వారిని బెదిరిస్తున్నారని ఈఓపై రహస్య ఆరోపణలు చేస్తున్నారు. 
 
ఉన్నతాధికారులైన చీఫ్‌ ఇంజనీర్‌, సహాయ గణాంకాధికారులు, మరికొంతమంది చెడు సలహాలతో సిబ్బందిని పలు రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈఓపై ఆరోపిస్తున్నారు. తితిదే నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి, ధర్మప్రచార పరిషత్‌ని విచ్చలవిడిగా మళ్ళించడం దారుణం అంటున్నారు.
 
తితిదే ఉద్యోగుల సహకార బ్యాంకుల్లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆనంద్‌రాజ్‌ క్రిస్టియన్‌ అని విజిలెన్స్ వారు ఆధారాలతో చూపించినా చర్యలు తీసుకోకపోవడంతో సిబ్బంది, సంఘం నాయకులు ఈఓపై పూర్తి అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఉద్యోగులు నివసిస్తున్నా క్వార్టర్స్ మరమ్మత్తులు, ఇళ్ళ స్థలాలు తదితర సమస్యలను పరిష్కరించకపోవడం దారుణం అంటున్నారు. 
 
మునుపటి ఈఓగా పనిచేసిన అజేయ్‌ కల్లాం వచ్చిన నాలుగు నెలల్లోనే స్టాండింగ్‌ సిబ్బందిపై బదిలీ చేపట్టి అవినీతిని బ్లాక్‌ మార్కెట్‌కి తావు లేకుండా చేశారన్నారు. ఇప్పడు పది లడ్డూలు ధర 200 రూపాయలకి అదీ గిరాకీగా దళారులు వ్యాపారాలు సాగిస్తున్నారన్నారు. లడ్డూలు తయారీ కొరత విఐపీల దర్శనాల కుదింపుతో బ్లాక్‌ మార్కెట్‌ రెట్టింపైందని భక్తులు అంటున్నారు. 
 
స్టాండింగ్‌ ఉద్యోగులతో పెరిగిపోతున్న అవినీతిని తగ్గించాలంటే బదిలీలు చేపట్టాలని వారు సూచించారు. ఉద్యోగుల్లో 20 శాతం ఈఓకి అనుకూలంగా ఉన్నా 60 శాతం సిబ్బంది చెప్పుకోలేని అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. దీంతో అధికారుల్లో వర్గభేదాలు మొదలయ్యాయని చెబుతున్నారు. తిరుమల తిరుపతి జేఈఓలకి పని ఒత్తిడి పెంచి ఈఓ పరిపాలనాధికారి పనిచేసే తితిదేకి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులను కాపాడుకోగలమని మేధావులు అంటున్నారు.
 
విజిలెన్స్ ఉన్నతాధికారుల పనితీరులో ఉన్న లోపాలతో కొండపై దళారులతో కుమ్మకై విజిలెన్స్ అధికారులు మామూళ్లు వసూళ్లు చేసుకుంటూ ఎవరో ఒక తలమాసినోడిని బలి చేస్తున్నదని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో తితిదే కుటుంబ యజమానిగా వ్యవహరిస్తున్న ఈఓ కఠిన నిర్ణయాలతో సిబ్బంది పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి శ్వేత క్యాంటిన్‌లో పెడుతున్న భోజనాలు అక్కడి అధికారులు సిబ్బంది అయిష్టంగా ఆరగిస్తున్నారు. నాణ్యత లేని చల్లారి ఎండి పోయిన భోజనాలను తినలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఓ నియంతగా వ్యవహరిస్తూ ప్రభుత్వ క్యాటరీని నియమితులుగా వేసుకుంటూ తితిదే సిబ్బందికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఈఓ దృష్టికి తీసుకువెళుతున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించక సిబ్బందిని అసహనానికి గురి చేస్తున్నారన్నారు. 
 
రాజకీయ ప్రాబల్యంతో అధికార పార్టీతో చేతులు కలపాలన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈఓ కఠిన నిర్ణయాలతో ఇటు ఉద్యోగులతో, అటు స్థానికుల్లోనూ అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి ఓటు శాతం సగానికి పైగా పడిపోయిందని మేధావులు చెబుతున్నారు. ఇకనైనా ఎవరో నలుగురి మాటలు వినకుండా సిబ్బంది సమస్యలపై ఆరా తీసి పరిష్కార దిశగా ఈఓ పాలన సాగించాలని స్థానికులు అంటున్నారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవాల్సిన ఈఓ, సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి వారిపై వేటు వేయడం తగదంటున్నారు.