శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (12:35 IST)

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి చిరకాల కోరిక.. కలగానే మిగిలిపోయిందట.. ఏంటో ఆ కల?

ముప్పవరపు వెంకయ్య నాయుడు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతల్లో అగ్రగణ్యుడు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో అన్నీ తానై చూసుకుంటున్న సీనియర్ మంత్రి. అలాంటి వెంకయ్యకు.. చిరకాలంగా ఓ కోరిక ఉందట. అదేంటంటే.. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ‌నుంచి చట్టసభలకు ప్ర

ముప్పవరపు వెంకయ్య నాయుడు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతల్లో అగ్రగణ్యుడు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో అన్నీ తానై చూసుకుంటున్న సీనియర్ మంత్రి. అలాంటి వెంకయ్యకు.. చిరకాలంగా ఓ కోరిక ఉందట. అదేంటంటే.. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ‌నుంచి చట్టసభలకు ప్రాతినిథ్యం వహించాలన్నది. కానీ, ఆ కోరిక ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. 
 
ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తాచాటలేని వెంకయ్య... పరోక్ష ఎన్నికల ద్వారా చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రాజ్యసభకు మూడుసార్లు ప్రాతినిథ్యం వహించిన ఆయన.. తాజాగా ఆయన మరోమారు పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. అయితే, సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాత్రంకాదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి. గతంలో కూడా ఆయన ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 
 
నిజానికి ఏ రాజకీయ నేత అయినా... స్వరాష్ట్రం నుంచి అధికార దర్పం వెలగబెట్టాలని భావిస్తారు. కానీ, వెంకయ్య నాయుడుకి మాత్రం ఆ కోరిక ఎప్పటినుంచో తీరలేదు. భవిష్యత్‌లో కూడా తీరుతుందన్న గ్యారెంటీ లేదు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం లభించిన వెంకయ్య నాయుడు కోసం ఏకంగా బీజేపీ పార్టి నిబంధనలు సడలించి నాలుగోసారి కూడా కర్ణాటక నుంచే పంపించాలని నిర్ణయం తీసుకుంది. 
 
అదీకూడా కర్ణాటక రాష్ట్రం నుంచి. దీనిపై కర్ణాటక బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వెంకయ్య నాయుడు మూడుసార్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయినా రాష్ట్రానికి ఒరగబెట్టిందేమి లేదనే విమర్శలు లేకపోలేదు. అయితే, పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంకయ్య నాయుడి విషయంలో వారు ఏం చేయలేక మిన్నకుండిపోయారు. 
 
వాస్తవానికి ఈ దఫా వెంకయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడో బెడిసికొట్టింది. పైగా ఏపీలో కూడికలు తీసివేతలు ఎంతచేసినా కలిసిరాలేదు. అదేసమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీకి మూడు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. వీటిలో ఒకటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు విధిగా కేటాయించాల్సిన పరిస్థితి. 
 
మరోసీటును వెంకయ్య (బీజేపీ)కి కేటాయిస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగనీ నిర్మలా సీతారామన్‌ను పక్కనబెట్టి వెంకయ్య నాయుడుకు చాన్స్ ఇవ్వడం మర్యాద కాదు. అట్లాగని రెండు సీట్లలో రెండూ బీజేపీకి ఇవ్వడం కుదరని వ్యవహారం కావడంతో వెంకయ్యకు పొరుగు రాష్ట్రమే దిక్కైంది.