Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2019 ఏపీ ముఖ్యమంత్రి ఎవరు? యాత్రలతో జగన్, పవన్ రెడీ(వీడియో)

శనివారం, 15 జులై 2017 (20:09 IST)

Widgets Magazine

2019 ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. 2019 ఏపీ ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల వద్దకు తరచూ వెళ్లి సభలు, సమావేశాలు పెడుతూ ముందుకు వెళుతున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంచి ఊపు మీద వున్నట్లు తెలుస్తోంది. 
chandrababu-pawan-jagan
 
తను ప్రారంభించిన రెండుమూడు సినిమాల షూటింగులు పూర్తి కాగానే రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగా ఆయన రథయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారట. అదేమిటంటే... ప్రజలను నేరుగా కలిసేందుకు రథయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారట. 
 
ఈ రథయాత్ర ఆయన పోటీ చేస్తానంటున్న అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోను పర్యటించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే అక్టోబరు 27 నుంచి జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. ఐతే జగన్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ రథయాత్రతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఏ యాత్ర చేస్తారో... 2019 ఎన్నికల తర్వాత ఎవరు సీఎం అవుతారో...? చూడండి వీడియోను...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
2019 Elections Ap Cm Chandrababu Naidu Pawan Kalyan Jagan Mohan Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాలకృష్ణపై హిందూపురం ప్రజలు గుర్రుగా వున్నారా? ఎందుకు?

బాలకృష్ణ. నందమూరి కుటుంబంలో ప్రస్తుతం కీలక రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి. ఎప్పటి నుండో తండ్రి ...

news

జగన్ పాదయాత్ర... పవన్ రథయాత్ర... మరి బాబు ఏం యాత్ర?

ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెల్లమెల్లగా రాజుకుంటోంది. ఇప్పటికే వైసీపీ అధినేత ...

news

వైసీపీ నుంచి టీడీపీకి బుట్టా రేణుక జంప్? నారా లోకేష్‌ను ఎందుకు కలిశారు..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ద్వారా తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత, నాయకులపై ...

news

అకున్... డ్రగ్స్ రాయుళ్ల తాటతీయ్... శెలవు రద్దు చేసిన టి.ప్రభుత్వం

ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శెలవుపై వెళ్లనున్నారన్న నేపధ్యంలో డ్రగ్స్ దందాపై ...

Widgets Magazine