Widgets Magazine

నేనున్నా జగన్.... నాగార్జున భరోసా.. ఏ విషయంలో?

మంగళవారం, 25 జులై 2017 (21:30 IST)

Widgets Magazine
Nagarjuna-Jagan

అసలే జనసేన పార్టీతో రెండు ప్రముఖ పార్టీలు సతమతం. అందులోను పవన్ కళ్యాణ్‌ లాంటి వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తే ఓట్లు చీలిపోయి కష్టకాలం వస్తుందనేది వైసిపి, టిడిపి నేతల ఆలోచన. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే ప్రధాన ఎన్నికలు రానున్నాయి. అందులోను ముందస్తు ఎన్నికలే. ఇక మిగిలింది చాలా తక్కువ సమయం. ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుండగా, ఈ ఎన్నికల్లో తమదే గెలుపన్న ధీమాతో వైసిపి ఉంది. 
 
అయితే జనసేన మాత్రం పోటీ చేస్తే రెండు పార్టీలకు ఇబ్బందులు తప్పవనేవి రాజకీయ విశ్లేషకుల భావన. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రచారకర్తను నియమించుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులోను ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తయితే మరీ మంచిదన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే ఆలోచించి ఒక నటుడిని ఎంచుకున్నట్లు సమాచారం. ఆయనే నాగార్జున. ఇప్పటికే నాగార్జునకు మంచి క్రేజ్ ఉంది. అగ్రహీరోల్లో ఆయన కూడా ఒకరు. 
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితులు. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి కూడా నాగార్జున మంచి మిత్రుడు. ఇదంతా జగన్ మోహన్ రెడ్డికి బాగా కలిసొచ్చే అంశమే. గత కొన్నిరోజుల ముందు నాగార్జునను స్వయంగా కలిసిన జగన్ వైసిపి ప్రచారకర్తగా చేయాలని కోరారట. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా సహాయం చేయాలని చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేశారట జగన్. దీంతో నాగార్జున చిన్న విషయానికి ఇంతలా అడగాల్సిన అవసరం లేదనీ, ఖచ్చితంగా తన వంతుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారట. అయితే అది ఎప్పుడనేది మాత్రం నాగార్జున స్పష్టంగా చెప్పలేదట. కనీసం మాట ఇచ్చినందుకు జగన్ ప్రస్తుతం సంతోషంగా ఉన్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కళ్ల ముందే సోదరి చనిపోతోంది.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో చూపించింది...

కళ్ల ముందే సోదరి ప్రాణాలు కోల్పోతున్న ఘటనను ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‍‌లో పోస్ట్ చేసింది. ...

news

సిగరెట్‌కు మరో 2 రూపాయలు చెల్లించమన్నందుకు కత్తితో పొడిచేసాడు...

సోమవారం సాయంత్రం లూథియానాలో ఒక అపరిచిత వ్యక్తి రెండు రూపాయల విషయంలో గొడవ జరిగి ...

news

మా నాన్న ప్రజల మనిషి.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఓకే: సౌందర్య రజనీకాంత్

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైందని తమిళనాట జోరుగా ...

news

150 అమ్మాయిల్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు.. రోజు కొకరు... 6 నెలల పాటు అత్యాచారం

ఐసిస్ ప్రభావం తగ్గిపోతున్న వేళ.. వారి నుండి తప్పించుకున్న మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని ...