Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పన్నీర్ సెల్వం రాజీనామా పత్రాన్ని వెనక్కి తీసుకోలేరుగానీ... అలా చేయొచ్చు

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:48 IST)

Widgets Magazine
ops - vidya

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఓ.పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆ తర్వాత దానిపై రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఆమోదముద్ర వేసి.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలాని కోరగా, దానికి పన్నీర్ సమ్మతించారు. 
 
ఆ తర్వాత అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆ తర్వాత తనతో శశికళ వర్గీయులు, తంబిదురై బృందం కలిసి బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీర్ ఆరోపించారు. ఇదేవిషయాన్ని గురువారం గవర్నర్ భేటీ సమయంలోనూ నొక్కివక్కాణించారు. పైగా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ సార్.. రాజీనామాను వెనక్కి తీసుకుంటాను అని విజ్ఞప్తి చేశారు. దీనికి గవర్నర్ వైపు ఎలాంటి స్పందన లేదు. 
 
అయితే పన్నీరు సెల్వం రాజీనామాపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు వీలుందా లేదా అన్న విషయంపై న్యాయనిపుణులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కొత్త సీఎం ప్రమాణం స్వీకారం చేసేవరకు ఓ.పన్నీరు సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పడం వల్ల సాంకేతికంగా రాజీనామాను వాపసు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. 
 
అంతటితో ఆగని ఆయన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని మద్దతు ఎక్కువగా ఉంది.. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరవచ్చని వారు అంటున్నారు. తద్వారా డీఎంకే మద్దతుతో సీఎం పీఠాన్ని కైవసం చేసుకుని మన్నార్గుడి మాఫియాను పోయెస్ గార్డెన్ నుంచి తరిమి కొట్టడమే కాకుండా, అన్నాడీఎంకే పార్టీని సైతం తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలన్నది పన్నీర్ సెల్వం యోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళలు గుర్తింపు లేని హీరోలు.. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ : వెంకయ్య

దేశ ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో మహిళలదే కీలకపాత్రని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ...

news

బందీలుగా శశివర్గ ఎమ్మెల్యేలు.. నో ఫోన్.. నో పేపర్.. నో టీవీ.. 'మన్నార్గుడి' సెక్యూరిటీ నీడలో రిసార్ట్స్

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బందీలుగా మారిపోయారు. తొలిరెండు రోజున విలాసవంతమైన గోల్డన్ బే ...

news

వేదనిలయంపై సరికొత్త ట్విస్ట్.. శశికళ మరదలు ఇళవరసిపై వీలునామా? ఎవరు రాశారు?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న దివంగత జయలలితకు అత్యంత ...

news

చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో కవిత.. అమరావతికి రాక.. ఆ సదస్సులో వేదిక పంచుకుంటారా?

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం ...

Widgets Magazine