Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హమ్మయ్య.. పీడ విరగడైంది.. అమ్మ ఆత్మ పన్నీరు వెంటే.. శశికి సపోర్ట్ చేస్తే అంతే సంగతులు..

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (14:33 IST)

Widgets Magazine

తమిళనాడు ప్రజలు చిన్నమ్మ అంటేనే గుర్రుగా ఉన్నారు. అమ్మ మరణంపై ఆమె వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. తనవైపున్న మాఫియా బలంతో ఎమ్మెల్యేలను తన వెంట తిప్పుకుని సీఎం పోస్టు కైవసం చేసుకోవాలనుకుంది. ఇంతలో అక్రమాస్తుల కేసు తీర్పు రావడంతో జైలుకెళ్లింది. ఈ నేపథ్యంలో తమిళ ప్రజలు ఏమంటున్నారంటే.. తమిళనాడుకు భవిష్యత్‌లో ఎవరైనా ముఖ్యమంత్రికావచ్చు. కాని అమ్మ ఆత్మ తమిళ ప్రజలకు శశికళ అండ్ మన్నార్ గుడి మాఫియా కభందహస్తాల్లో పడకుండా చిక్కుకోకుండా తప్పించిందని భావిస్తున్నారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. వెంటనే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక అసలు శశికళ ముఖ్యమంత్రి కల సాకారం కాలేదు. 
 
పన్నీర్ సెల్వానికి కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు భావించాలి. కానీ శశికళ రెసార్ట్‌లోనే మేనల్లుడు దీపక్‌ను రంగంలోకి తెచ్చింది. జయలలిత అంత్యక్రియల కార్యక్రమంతో "జయలలిత మేనల్లుడు దీపక్" వెలుగులోకి వచ్చాడు. ఇతనిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నారు. కానీ చిన్నమ్మ విధేయుడు పళనిసామి లైన్లోకి వచ్చారు. దీంతో పన్నీరుకు షాక్ ఎదురైంది. అంతటితో ఆగకుండా.. జయలలిత పోయెస్ గార్డెన్‌తో పాటు... పార్టీ నుంచి గెంటేసిన వారందరినీ తన బంధువులకు... పార్టీలో కీలక పదవులను శశికళ కట్టబెట్టడం చాలా మందికి మింగుడు పడటం లేదు.
 
 పోయస్ గార్డెన్ నుంచి జయ తరిమేసిన తన మేనల్లుడు టిటివి.దినకరన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ కట్టబెట్టారు. ఇది చాలా మందికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోనుందనే సంకేతాలు అందుతున్నాయి. అమ్మకు అత్యంత విధేయుడు, మచ్చలేని మనిషి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విధంగానే ప్రజలు కూడా భావిస్తున్నారు. శశి వర్గంలో ఇన్నాళ్లు రెసార్ట్‌లో చిందులేసిన ఎమ్మెల్యేలు పన్నీరుకు సపోర్ట్ చేయకపోతే.. నియోజకవర్గాల్లో తిరగలేరని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 
 
మాఫియా గ్యాంగుతో లింకున్న శశికళకు సపోర్ట్ చేస్తే.. అమ్మ ఆత్మ క్షోభిస్తుందని.. ఆమె భూతమై మారి వారిని వదిలిపెట్టదని ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి అమ్మ ఆత్మే శశికళను జైలుకు పంపిందని.. తనకు చేసిన అన్యాయానికి శిక్ష పడేలా చేసిందని తమిళ ప్రజలు అనుకుంటున్నారు. ఇదే పరిస్థితి ఎమ్మెల్యేలకు రాకుండా ఉండాలంటే... పన్నీరు వెంట నడవాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు. తాము ఓటేసింది.. అమ్మకే కానీ చిన్నమ్మకు కాదని వారు గుర్తు చేస్తున్నారు. అందుకే విధేయుడైన పన్నీరుకు అమ్మ స్థానాన్ని ఇవ్వడం సముచితమని వారు భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయ సమాధి వద్ద శశికళ వింత ప్రవర్తన.. 'కసి'కళగా మారి సమాధిపై 3 సార్లు కొట్టి శపథం

ముఖ్యమంత్రి దివంగత జయలలిత సమాధి వద్ద అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వింతవింతగా ...

news

శశికళ మళ్లీ కోర్టుకెందుకుగానీ నేరుగా జైలుకే తరలించండి.. కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలు

జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన శశికళను నేరుగా బెంగుళూరులోని పరప్పణ ...

news

జయ సమాధిపై శపథం చేసి బెంగుళూరుకు శశికళ పయనం... బేరసారాలకు దిగిన పన్నీర్ వర్గం

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

పోయెస్ గార్డెన్ నుంచి శశి చుట్టాలందరూ వెళ్ళిపోండి.. దీపతో పన్నీర్ రెఢీ.. చిన్నమ్మ కసి తీర్చుకుంటుందా?

చిన్నమ్మ శశికళ జైలుకెళ్లిపోయింది.. ఇక ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ సెల్వం పనికానిస్తున్నారు. ...

Widgets Magazine