శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (18:19 IST)

ఓజోన్ డే... అంటార్కిటికాపై ఓజోన్ రంధ్రం 2050కి పూడుకుపోతుందట... జనావాసాలపై మాత్రం?

సూర్యుని నుండి విడుదలయ్యే సూర్యరశ్మిలో అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటూ వాటి నుంచి భూమిపై ఉన్న జీవజాలాన్ని రక్షిస్తున్నదే ఓజోన్ పోర. ప్రోటో ఆవరణానికి కింద 15 నుంచి 50 కి.మీ మందంగా ఉండే పొరనే ఓజోను పొరగా పిలుస్తారు. ఇది అతినీల లోహిత కిరణాలను వడపోసి సూర

సూర్యుని నుండి విడుదలయ్యే సూర్యరశ్మిలో అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటూ వాటి నుంచి భూమిపై ఉన్న జీవజాలాన్ని రక్షిస్తున్నదే ఓజోన్ పోర. ప్రోటో ఆవరణానికి కింద 15 నుంచి 50 కి.మీ మందంగా ఉండే పొరనే ఓజోను పొరగా పిలుస్తారు. ఇది అతినీల లోహిత కిరణాలను వడపోసి సూర్యరశ్మిని భూమిపైకి పంపుతుంది. ఇది భూమి చుట్టూ ఒక గొడుగులా ఆవరించి ఉండి, ఒక కవచంలా కాపాడుతుంది. ఇప్పుడు ఓజోను పొర మానవ తప్పిదాలకు కనుమరుగైపోతుంది. 
 
అధిక ఇంధన వాడకం, మితిమీరిన రసాయనాలు ఉపయోగించడం, చెట్లు నరికివేయడం, వంటి అంశాలు ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి. ఈ ఓజోన్ పొర క్షీణత వల్ల మూలకణ మరియు పొలుసల కణ క్యాన్సర్లు, ప్రాణాంతక పుట్టకురుపు, కంటి శుక్లాలు వంటి రోగాల బారిన ప్రజలు పడే అవకాశం ఉంది. కాలుష్య కారకాల నుండి ఓజోన్‌ను రక్షించేందుకు ఐక్యరాజ్యసమితి కొన్ని ప్రణాళికలు రూపొందించింది. దానినే మాంట్రియల్ ప్రోటోకోల్ అంటారు. 
 
ఇందులో సుమారు 100 రకాల రసాయనాల వాడకాన్ని 2030 నాటికి అభివృద్ధి చెందిన, 2040 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పూర్తిగా అరికట్టడమే లక్ష్యం. 1987 సెప్టెంబర్ 16న మాంట్రియల్ ప్రోటోకోల్ పైన ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. ఆ రోజు గుర్తుగా ఐక్యరాజ్యసమితి 1994లో సెప్టెంబర్ 16వ తేదీని అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 16న ఓజోన్ దినోత్సవం నిర్వహిస్తుంది. 
 
కాగా 2050 నాటికి అంటార్కిటికా పైన ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం పూడుకుపోతుందని పరిశోధకులు చెపుతున్నారు. ఐతే అక్కడ పూడుకుపోయినా నిత్యం రసాయనాలను వదులుతున్న జనారణ్యం పైన పడదా అంటే మాత్రం నొసలు ఎగరేస్తున్నారు. ఇప్పటికైనా కాలుష్యాన్ని అరికట్టగలిగితేనే ప్రమాదం నుంచి బయటపడగలుగుతాం.