శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: గురువారం, 14 జులై 2016 (19:08 IST)

పవన్ కళ్యాణ్‌కు రాంగ్ డైరెక్ష‌న్ ఇస్తోంది ఆయ‌నేనా?

హైద‌రాబాద్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ .. ఒక పెద్ద హీరో అనే క‌న్నా... ఆయ‌న సేవా తత్వం, కష్టపడే నైజం, నిజాయితీ ఆయన్ని ఇతర హీరోలకు భిన్నంగా నిల‌బెట్టాయి. మరి ఇంత క్రేజ్ సంపాదించుకున్న పవన్ కూడా చాలాసార్లు విమర్శల‌ పాలవుతున్నాడు. అటు అమ‌రావ‌తి రాజ‌ధాని భూ

హైద‌రాబాద్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ .. ఒక పెద్ద హీరో అనే క‌న్నా... ఆయ‌న సేవా తత్వం, కష్టపడే నైజం, నిజాయితీ ఆయన్ని ఇతర హీరోలకు భిన్నంగా నిల‌బెట్టాయి. మరి ఇంత క్రేజ్ సంపాదించుకున్న పవన్ కూడా చాలాసార్లు విమర్శల‌ పాలవుతున్నాడు. అటు అమ‌రావ‌తి రాజ‌ధాని భూముల విష‌యం గాని, ఇటు జ‌న‌సేన పార్టీ విష‌యంలోగాని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల వెల్లువ‌. దీనికి కార‌ణం ఎవ‌రు? 
 
మెగాస్టార్ చిరంజీవి.. అశేష తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వచ్చిన స్పందన ఎన్టీఆర్ స్థాయిని త‌ల‌పించింది. ఉవ్వెత్తున ఎగ‌సిన చిరు కెర‌టం... చివ‌రికి చ‌ల్లారిపోవ‌డానికి ఆయన వెనకాల ఉన్న సొంత మ‌నుషులే అని అందరికీ తెలుసు. చిరంజీవి రాజకీయంగా పార్టీ పెట్టిన నెలల్లోనే ‘ప్రజారాజ్యం’ అవినీతికి అడ్డా అనే విమర్శలు వచ్చాయి. టికెట్ కావాలన్నా.. పార్టీలో మంచి పొజిషన్ కావాలన్నా కోట్లు ఇవ్వాలని ఆ ‘‘ఇంటి వ్యక్తి’’ చేసిన డిమాండ్స్ అన్న‌య్య‌ను రాజకీయాల్లో అభాసుపాలు చేసింది. 
 
ఇప్పుడు త‌మ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే రిపీట్ కాబోతోందని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అప్పుడు చిరంజీవికి ‘‘ఆయన’’ లాగానే.. ఇప్పుడు పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా, మిత్రుడిగా పేరు తెచ్చుకున్న శరత్ మరార్ వల్ల పవన్ కళ్యాణ్ అభాసుపాలవుతున్నాడని… ఆయ‌న స‌న్నిహితులు మొత్తుకుంటున్నారు.
 
అతని చర్యలు, చేష్టలు పవన్ ఇమేజ్‌ను డామేజ్ చేసేవిగా ఉన్నాయని.. వారికి సన్నిహితంగా ఉండేవారే చెప్పుకుంటున్నారు. చనువిస్తే చంకనెక్కినట్టుగా .. శరత్ మరార్ పవన్ విషయంలో ప్రవర్తిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తూ.. అన్ని విషయాల్లోనూ పవన్ పైన విమర్శలు వచ్చేలా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. పవన్‌ది ఫ్యాన్స్ వల్ల వచ్చిన ఇమేజ్. శరత్‌ది బిజినెస్ మైండ్. ఆపదలో ఉన్నవారిని మూడో కంటికీ తెలియకుండా ఆదుకునే నైజం పవన్‌ది. దీనికి భిన్నంగా శరత్ మరార్ వ్యాపారపరంగా చూస్తాడని చెపుతారు. ఇదే ఈ ఇద్దరి మధ్యా తేడా అని చెప్పుకుంటున్నారు.
 
రీసెంట్‌గా సర్దార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్ వల్ల నష్టపోయిన బయ్యర్స్‌ను ఆదుకుంటానని పవన్ హామీ ఇచ్చాడు. పవన్‌కు సన్నిహితుడిగానే కాదు, ఆ సినిమా నిర్మాతగానూ ఆ విషయంలో పవన్‌కు మాట రాకుండా చూడాల్సిన శరత్ మరార్, ఇప్పుడు వారిని కనీసం పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఇబ్బంది పడేది.. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్‌తో మాటలు పడేది పవన్ కళ్యాణే. అప్పుడు పవన్ చెప్పాడని.. నెక్ట్స్ సినిమాకు అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని మాటిచ్చాడు.
 
కానీ ఇప్పుడా మాటను తప్పడమే కాదు, నష్టపోయిన వారిని పట్టించుకోకుండా.. కొత్తవారితో బిజినెస్ అగ్రిమెంట్స్ అయ్యేలా శ‌ర‌త్ మ‌రార్ బ్యాక్‌గ్రౌండ్ డైరెక్ష‌న్ చేస్తున్నాడ‌ట‌. అలాగే పొలిటికల్ పార్టీ విషయంలో కూడా చాలాసార్లు శరత్ మరార్ రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాడని, అదే జనసేన పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం జనాల్లో ఇప్పుడు లేకపోవడానికి కారణం అంటున్నారు. కొందరికే చనువిస్తే.. మ‌నం నష్టపోక తప్పదు. మరి శరత్ మరార్ చేస్తున్న విషయాలు పవన్ కళ్యాణ్‌కు తెలుసో లేదో కానీ.. ఖచ్చితంగా అన్నయ్య లాగే తమ్ముడూ నష్టపోవడం మాత్రం ఖాయం అని పవన్‌కు సన్నిహితంగా ఉండే మిత్రులు ఓపెన్‌గానే విమ‌ర్శలు చేస్తున్నారు. మరి తమ్ముడు ఇకనైనా కాస్త వెనక్కి తిరిగి ఆలోచిస్తాడేమో చూడాలి.